శ్రీశైల మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీశైలంలో మంగళవారం, శుక్రవారాలలో స్వామివారి ఉచిత స్పర్శదర్శనం వుంటుంది. అయితే ఈ ఉచిత స్పర్శ దర్శనం వేళల్లో మార్పులు చేశారు దేవస్థానం అధికారులు. శ్రీ శైలంలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం మంగళవారం నుండి శుక్రవారం వరకు భక్తులకు కల్పిస్తున్న మల్లికార్జునస్వామి స్పర్శ దర్శన వేళలు మార్చాలని దేవస్థానం నిర్ణయించింది. నేటినుండి నుంచి వారంలో నాలుగు రోజులపాటు అనగా మంగళ వారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 గంటలనుంచి 4 గంటలవరకు…
తెలుగుదేశం 40 ఏళ్ళ పండుగ తెలుగు తమ్ముళ్ళను ఖుషీ చేస్తోంది. ఒంగోలు మహానాడు సభ సక్సెస్ తో ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీప శ్రేణులు జోష్ మీదున్నాయి. ఆల్ టైం రికార్డులు సృష్టించిన ఈ సభతో వచ్చే ఎన్నికల్లో తాము ముందే గెలిచినట్లుగా భావిస్తున్నారు. ఎన్నో ఇబ్బందులను అధిగమించి టీడీపీ కార్యకర్తలు లక్షల సంఖ్యలో సభకు హాజరు కావటం టీడీపీ నేతలకు కొత్త ఉత్యాహాన్నిచ్చింది. అయితే వైసీపీ నేతలు మాత్రం టీడీపీ నేతలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని..…
అవకాశం దొరికితే చాలు జనాన్ని అడ్డంగా ముంచేస్తున్నారు కేటుగాళ్ళు. విశాఖలో ఓ నకిలీ సివిల్ సప్లైస్ అధికారి గుట్టురట్టయింది. పౌర సరఫరాల అధికారిగా చెప్పుకుంటూ హాస్టళ్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకుల నుంచి డబ్బులు దండుకుంటున్న రాజమహేంద్రవరానికి చెందిన ఆడంకి చక్రవర్తిని విశాఖలోని ఎంవీపీ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. చక్రవర్తి తన స్నేహితుడు శ్రీనివాస్‌తో కలిసి శనివారం ఎంవీపీ కాలనీలోని గోదావరి టిఫిన్ సెంటర్‌కు వెళ్లి కమర్షియల్ సిలిండర్లకు బదులు డొమెస్టిక్ సిలిండర్లను ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించాడు.…
నందమూరి నటసింహం చిలకలూరిపేటలో సందడి చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్ లో అఖండ సిల్వర్ జూబ్లీ వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేశారు నందమూరి బాలకృష్ణ. ఈ వేడుకల్లో దర్శకుడు బోయపాటి శ్రీను, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, అశేష ప్రేక్షకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను బాలయ్య డైలాగ్స్ తో అభిమానుల్లో జోష్ నింపారు. వంద రోజులు వినడమే గగనమైన రోజుల్లో సింహా, లెజెండ్ అఖండ సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం ఆనందంగా…
వేసవి సెలవులు నడుస్తుండడంతో తిరుమలకు వెళ్ళే భక్తుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి భక్తులకు కీలక సూచనలు అందించారు. భక్తుల రద్దీ కారణంగా దర్శనాల కోసం రోజుల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. వరుస సెలవుల కారణంగా తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. కాగా, భక్తులకు అవసరమైన సౌకర్యాలను అందిస్తున్నామని, స్వామి వారి దర్శనం కోసం క్యూ లైన్లో వేచి ఉన్న భక్తులకు ఆహారం, తాగేందుకు నీరు అందిస్తున్నామన్నారు.…
* ఐపీఎల్ 2022: రసవత్తరంగా మారిన ఐపీఎల్ పోరు. ఫైనల్ లో తలపడనున్న రాజస్థాన్-గుజరాత్. ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న గుజరాత్ టైటాన్స్. రాత్రి 7.30 గంటలకు అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ * అనంతపురంలో సామాజిక న్యాయ భేరీ కార్యక్రమంలో భాగంగా వైసీపీ మంత్రుల బస్సు యాత్ర ముగింపు సభ. 1700 మంది పోలీసులతో భారీ బందోబస్తు. *నేడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో సామాజిక న్యాయభేరి బస్సు యాత్ర. నంద్యాల నుంచి బయల్దేరి కర్నూలు చేరుకోనున్న…
https://www.youtube.com/watch?v=9PVGS8VluRE ఆదివారం రాశిఫలాలు ఎలా ఉన్నాయి..? ఏ రాశివారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది..? ఏ రాశివారు కొత్త పనులు చేపట్టేందుకు అనుకూలంగా ఉంటుంది..? ఏ రాశివారు కొత్త పనులు వాయిదా వేసుకుంటే మంచిది.. ఎవరు ఈ రోజు ఎలాంటి పూజలు చేయాలి లాంటి పూర్తి వివరాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..
ఈరోజుల్లో ఆస్తి తర్వాతే ఏదైనా. ఓ కొడుకు ఆస్తి కోసం ఎంతకైనా తెగించాడు. చిత్తూరు జిల్లా పీలేరులో ఆస్తి కోసం కన్న తండ్రికి నరకం చూపించాడు. ఆస్తి కోసం కన్న తండ్రి చంద్ర శేఖర్ రెడ్డిని హతమార్చ ప్రయత్నం చేసిన కొడుకు కథ ఇది. అతను రిటైర్డ్ ఆర్మీ జవాన్ లక్ష్మీ ప్రసాద్ రెడ్డి కావడంతో సమాజం నివ్వెరపోయింది. ఈనెల 23 తేదీన బైక్ పై వెళుతున్న తండ్రిని తిరుపతి సాగర్ షోరూం సమీపంలో కారుతో ఢీకొట్టాడు…