వైసీపీలో వర్గ విభేదాలకు.. సరికొత్త రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది హిందూపురం. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై అసమ్మతి ప్రభావం కనిపిస్తోంది. వీటిన్నింటి మధ్య ఎమ్మెల్సీ ఇక్బాల్ ఒంటరి పోరాటం చేస్తున్నారనే చెప్పాలి. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు మహ్మద్ ఇక్బాల్. ఆయన మాజీ పోలీస్ అధికారి. ఎన్నికల్లో ఓడినా.. ఎమ్మెల్సీని చేసింది వైసీపీ. అయితే ఇక్బాల్ హిందూపురం వచ్చిన్పటి నుంచీ పార్టీలో అసమ్మతి కాక రేపుతూనే ఉంది. 2019 వరకు…
కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసు కస్టడీ పిటిషన్ పై మిస్టరీ నెలకొంది. ఇప్పటికే రిమాండ్ రిపోర్ట్ కు, పోస్ట్ మార్టం రిపోర్ట్ కు పొంతనలేదు. మరో కొత్త సీన్ క్రియేట్ చేయడానికే కస్టడీ పిటిషన్ వేశారా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. మరోవైపు మృతుడు తల్లి ఈ హత్య ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరడంతో పోలీసులు కొత్త చిక్కుల్లో పడతారా అనేది చర్చనీయాంశంగా మారింది. గత నెల 19న…
ఒక్కోసారి చిన్నచిన్న పొరపాట్లు జరుగుతుంటాయి. కొంతమంది దేవాలయాలకు చందాలు, విరాళాలు ఇస్తుంటారు. ఒక వ్యక్తి ఇచ్చిన విరాళం తక్కువే అయినా, కోట్లలో విరాళం ఇచ్చినట్టు దేవస్థానం రికార్డుల్లో నమోదైంది. ఏలూరు జిల్లాలోని ద్వారకా తిరుమలలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి శ్రీవారి నిత్య అన్నదానం ట్రస్టుకు. రూ. 2116 చెల్లించాడో భక్తుడు. కానీ రూ 8.కోట్లకు పైగా ఇచ్చినట్టు ఆన్ లైన్లో ఎంటర్ చేశాడో ఉద్యోగి. ఆ తప్పు సరిదిద్దుకునేందుకు ఆలయ అధికారులు నానా తిప్పలు పడుతున్నారు. ఏలూరు జిల్లా…
*ఇవాళ తిరుమలలో కరెంట్ బుకింగ్ విధానంలో జ్యేష్ఠాభిషేకం టిక్కెట్లు విడుదల చెయ్యనున్న టీటీడీ. *నేడు గుంటూరు , తెనాలి ప్రాంతాల్లో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రవీణ్ పవార్ పర్యటన *నేడు శ్రీ వెంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) యూనివర్సిటీ 11వ స్నాతకోత్సవం. పాల్గొననున్న టీటీడీ ఛైర్మన్ &స్విమ్స్ ఛాన్సలర్ వైవీ సుబ్బారెడ్డి,ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డా. సౌమ్య స్వామినాథన్. *విశాఖ నగరానికి రానున్న కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి…
టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎంపీ విజయసాయిరెడ్డి. భవానీపురంలో జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయాన్ని భవానీ పురంలో ప్రారంభించిన ఎంపీ విజయసాయిరెడ్డి. మంత్రులు తానేటి వనిత, అంబటి రాంబాబు, జోగి రమేష్, జిల్లా పార్టీ అధ్యక్షుడు వెల్లంపల్లి, ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో జిల్లాలో ఏడు స్థానాలు గెలిచి సీఎంకి బహుమతిగా ఇస్తామన్నారు వెల్లంపల్లి. 26 జిల్లాల్లోనూ పార్టీ సొంత కార్యాలయాలు నిర్మించుకుంటాం. ఏడాది గడువులో…
కర్నూలు జిల్లాలో మామిడి దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. చెట్టుకు ఒక కాయ కూడా లేదంటే నమ్ముతారా? టన్నుల కొద్దీ మామిడి పండించిన రైతులు ఇపుడు క్వింటాళ్ల దిగుబడి కూడా లేక తల్లడిల్లిపోతున్నారు. దశాబ్దాల కాలంగా ఇంత తక్కువ దిగుబడి ఎప్పుడు చూడలేదంటున్నారు రైతులు. బంగినపల్లి మామిడికి కర్నూలు జిల్లా ప్రసిద్ధి. వందేళ్ల మామిడి తోటలు ఉన్నాయంటే బంగినపల్లి మామిడి ఈ ప్రాంతంలో ఎంతగా ప్రసిద్ధి చెందిందో స్పష్టమవుతోంది. అనేక రకాల మామిడి సాగు చేస్తున్నా అందులో బంగినపల్లి…
తెలుగు రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలు వస్తాయా ? ఏపీ, తెలంగాణలో అధికార పార్టీలు.. ఆ దిశగా ముందుకు వెళ్తున్నాయా ? విపక్ష నేతలు చేస్తున్న ప్రచారంలో నిజం ఎంత ? అసలు ఎందుకు ఈ రకమైన ప్రచారం జరుగుతోంది ? తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు హాట్ హాట్‌గా సాగుతున్నాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇటు తెలంగాణలోనూ రాజకీయ వాతావరణ వేడెక్కింది. అన్ని పార్టీలు తమ పాలిటిక్స్‌ను యాక్టివ్ మోడ్‌లోకి మార్చేశాయి. ముందస్తు ఎన్నికల ప్రచారాలతో ఈ వాతావరణం మరింత…
ఏపీలో పదవతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. టెన్త్ ఫలితాల పై వైసీపీ, టీడీపీ ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ నేత లోకేష్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ట్విట్టర్ లో లోకేష్ కు కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. టెన్త్ లో ఉత్తీర్ణత శాతం తగ్గడానికి ‘నారాయణ’ ప్రశ్న పత్రాలను లీక్ చేయడమే కారణం పప్పు నాయుడూ. పిల్లల్ని అయోమయంలోకి నెట్టి మానసికంగా డిస్టర్బ్ చేసిన పాపం మీదే. దిగజారి…
మంగళగిరిలో జరుగుతున్న జనసేన విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు అధినేత పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికల తేవాలనే ఉద్దేశ్యంతోనే కోనసీమలో కుట్ర పన్నారన్నారు నాదెండ్ల.వచ్చే నెలలో పులివెందులలో పవన్ పర్యటన వుంటుందన్నారు. ప్రభుత్వమే కోనసీమలో కులాల చిచ్చు పెట్టింది.కోనసీమ ఘటనపై ఇప్పటి వరకు సీఎం జగన్ స్పందించ లేదు.కోనసీమలో శాంతి నెలకొనాలనే అప్పీల్ కూడా చేయలేదు.ముందస్తు ఎన్నికలు తేలవాలనే వ్యూహంలో భాగంగానే కోనసీమ…
మిస్ట్ కాల్ వస్తే దానిని కట్ చేయడం మానేసి.. అవతలి గొంతు హస్కీగా వుందని మీరు దానికి టెంప్ట్ అయితే అంతే సంగతులు. ఆ స్వరం మిమ్మల్ని పాతాళంలోకి నెట్టేస్తుంది. మహిళా గొంతుతో లక్షల్లో అక్రమ సంపాదనకు తెరతీశాడో ప్రబుద్ధుడు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో అక్రమ సంపాదన కోసం అడ్డదారి తొక్కాడు. ఆడ గొంతుతో మగాళ్లను బురిడీ కొట్టిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. మగాళ్లకు మిస్డ్ కాల్ చేయడం… వారితో ఆడ వారి లాగా మాట్లాడడం ఆర్థికంగా…