మందుబాబులకు షాకిచ్చారు తిరుపతి పోలీసులు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వందల మద్యం బాటిళ్ళను నాశనం చేశారు. తిరుపతి రేణిగుంటలో అక్రమ రవాణాలో పట్టుబడిన
68 లక్షల మద్యం సీసాల ధ్వంసం చేశారు. ఇలాంటి దృశ్యాలు చూసిన మందుబాబులు లోలోన కుమిలిపోతున్నారు. అలా భూమిపాలు చేసేకంటే మాలోంటోళ్ళకు ఇస్తే తాగి, ఊగి ఎంజాయ్ చేసేవాళ్లం కదా అంటున్నారు మందుబాబు. జిల్లాలో ఎస్ ఇ బి తనిఖీలలో పట్టుబడ్డ మద్యం బాటిళ్లను రోడ్ రోలర్ తో ధ్వంసం చేశారు.
తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి పర్యవేక్షణలో కార్యక్రమం నిర్వహించారు. మద్యం అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బెల్ట్ షాపులు మద్యం అక్రమంగా రవాణా చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. అలా సమాచారం ఇచ్చినవారి వివరాలు గుట్టుగా వుంచుతామంటున్నారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే ఎంతటి వారికైనా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. గత నెలలో తిరుపతిలో ఇలాంటి సీన్లు కనిపించాయి. 2019 జులై నుంచి సప్తగిరి తనిఖీ కేంద్ర వద్ద భక్తుల నుంచి స్వాధీనం చేసుకున్న మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. ఎస్‌ఈబీ ఎన్‌ఫోర్స్‌మెంట్ సూపరింటెండెంట్ స్వాతి టీటీడీ సిబ్బంది చేత మొత్తం 1061 బాటిళ్లను పగులగొట్టి ధ్వంసం చేయించారు.
కలియుగ వైకుంఠం తిరుమల కొండపైకి లిక్కర్ తీసుకెళ్లడం నిషేధం. అయితే తెలిసీ, తెలియక మద్యం బాటిళ్లు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కొందరు భక్తులు. మరి కొంత మంది తమ వాహనాల్లో రహస్యంగా బాటిళ్లను పెట్టుకొని పోలీసుల కళ్లుగప్పి కొండపైకి వెళ్లేందుకు ప్రయత్నించడం జరుగుతోంది. భద్రతాధికారులు మాత్రం నిఘా ఉంచి వాటి గుట్టుపట్టేస్తున్నారు. అలా పట్టుబడ్డ వాటిని ధ్వంసం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అక్రమంగా తరలిస్తూ పట్టుబడ్డ లిక్కర్ బాటిళ్ళకు ఇదే గతి పడుతోంది.
TDP Mahanadu: గుడివాడలో టీడీపీ మహానాడు వాయిదా