విశాఖలోని బ్రాండిక్స్ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్థన్ రెడ్డి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం ఎస్‌ఇజెడ్‌లోని బ్రాండిక్స్ కంపెనీలో జరిగిన ప్రమాదంపై ఆయన విచారణ వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయిలో విచారణ జరిపి , దోషులను కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీజీపీ డిమాండ్ చేస్తోందన్నారు. విశాఖపట్నంలో అత్యంత విషాదంగా ఘటన ఎల్జీ పాలిమర్స్ తరవాత కూడా పరిశ్రమల యాజమాన్యాలు, ప్రభుత్వాలు చర్యలు…
కోనసీమలో జరిగిన సంఘటన చాలా సున్నితమయిన అంశం అన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. మీడియాతో పవన్ కళ్యాణ్ చిట్ చాట్ నిర్వహించారు. కోనసీమలో తాజా పరిస్థితేంటని మీడియా ప్రతినిధులను ఆరా తీశారు పవన్. మంత్రి పినిపె విశ్వరూప్ కూడా బాధితుడేనంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. కోనసీమ ఎపిసోడ్ సెన్సిటివ్‌గా ఉందనే విషయాన్ని కేంద్ర నిఘా విభాగం ముందుగానే అలెర్ట్ చేసింది. అయినా ప్రభుత్వం అంతగా పట్టించుకోలేదన్నారు. కేంద్రం అలెర్ట్ చేసినా.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించ లేదని…
హోంమంత్రి అమిత్‌షాతో సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ ముగిసింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సీఎం వైఎస్.జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఆయన చర్చించారు. సౌత్‌జోనల్ కమిటీ సమావేశంలో భాగంగా ప్రస్తావించిన విభజన సమస్యలు – వాటి పరిష్కార ప్రక్రియపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఈ క్రమంలో ఇటీవల జరిగిన అధికారుల సమావేశాల అంశంకూడా ప్రస్తావనకు వచ్చింది. రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు పూరై్తనా ఇప్పటికీ ఆస్తుల…
జూన్ 1 నుంచి గీతం అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రారంభం విలేఖరుల సమావేశంలో వెల్లడించిన గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం తొలి దశ ఆన్లైన్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ప్రక్రియ జూన్ 1 , 2022 నుంచి ప్రారంభం కానుందని గీతం హైదరాబాద్ అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు మంగళవారం హైదరాబాద్ లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. అఖిల భారత గీతం ప్రవేశ పరీక్ష (గాట్ -2022 )ని దేశవ్యాప్తంగా 83…
శ్రీశైల మహాక్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. శ్రీశైలంలో మంగళవారం, శుక్రవారాలలో స్వామివారి ఉచిత స్పర్శదర్శనం వుంటుంది. అయితే ఈ ఉచిత స్పర్శ దర్శనం వేళల్లో మార్పులు చేశారు దేవస్థానం అధికారులు. శ్రీ శైలంలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం మంగళవారం నుండి శుక్రవారం వరకు భక్తులకు కల్పిస్తున్న మల్లికార్జునస్వామి స్పర్శ దర్శన వేళలు మార్చాలని దేవస్థానం నిర్ణయించింది. నేటినుండి నుంచి వారంలో నాలుగు రోజులపాటు అనగా మంగళ వారం నుంచి శుక్రవారం వరకు మధ్యాహ్నం 2 గంటలనుంచి 4 గంటలవరకు…
తెలుగుదేశం 40 ఏళ్ళ పండుగ తెలుగు తమ్ముళ్ళను ఖుషీ చేస్తోంది. ఒంగోలు మహానాడు సభ సక్సెస్ తో ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీప శ్రేణులు జోష్ మీదున్నాయి. ఆల్ టైం రికార్డులు సృష్టించిన ఈ సభతో వచ్చే ఎన్నికల్లో తాము ముందే గెలిచినట్లుగా భావిస్తున్నారు. ఎన్నో ఇబ్బందులను అధిగమించి టీడీపీ కార్యకర్తలు లక్షల సంఖ్యలో సభకు హాజరు కావటం టీడీపీ నేతలకు కొత్త ఉత్యాహాన్నిచ్చింది. అయితే వైసీపీ నేతలు మాత్రం టీడీపీ నేతలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని..…
అవకాశం దొరికితే చాలు జనాన్ని అడ్డంగా ముంచేస్తున్నారు కేటుగాళ్ళు. విశాఖలో ఓ నకిలీ సివిల్ సప్లైస్ అధికారి గుట్టురట్టయింది. పౌర సరఫరాల అధికారిగా చెప్పుకుంటూ హాస్టళ్లు, టిఫిన్ సెంటర్ల నిర్వాహకుల నుంచి డబ్బులు దండుకుంటున్న రాజమహేంద్రవరానికి చెందిన ఆడంకి చక్రవర్తిని విశాఖలోని ఎంవీపీ జోన్ పోలీసులు అరెస్టు చేశారు. చక్రవర్తి తన స్నేహితుడు శ్రీనివాస్‌తో కలిసి శనివారం ఎంవీపీ కాలనీలోని గోదావరి టిఫిన్ సెంటర్‌కు వెళ్లి కమర్షియల్ సిలిండర్లకు బదులు డొమెస్టిక్ సిలిండర్లను ఎందుకు వాడుతున్నారని ప్రశ్నించాడు.…
నందమూరి నటసింహం చిలకలూరిపేటలో సందడి చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్ లో అఖండ సిల్వర్ జూబ్లీ వేడుకలలో పాల్గొని కేక్ కట్ చేశారు నందమూరి బాలకృష్ణ. ఈ వేడుకల్లో దర్శకుడు బోయపాటి శ్రీను, మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, అశేష ప్రేక్షకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు బోయపాటి శ్రీను బాలయ్య డైలాగ్స్ తో అభిమానుల్లో జోష్ నింపారు. వంద రోజులు వినడమే గగనమైన రోజుల్లో సింహా, లెజెండ్ అఖండ సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం ఆనందంగా…