ఏపీలోని విద్యార్థులకు జగన్ సర్కార్ శుభవార్త.. స్కూల్స్ ప్రారంభమైన రోజు నుంచే రాష్ట్రంలో విద్యా కానుక అందించాలని సర్కార్ డిసైడ్.. రేపటి నుంచి అన్ని పాఠశాలలో జగనన్న విద్యా కానుకను అందిస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స.. సుమారు 43 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం కింద స్కూల్ డ్రెస్సులు, బూట్లు, రెండు జతల సాక్సులు, బ్యాగ్, బెల్ట్, పుస్తకాలు అందజేత
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ లో పర్యటన షెడ్యూల్ మారింది. ఇవాళే ఆయన రాష్ట్రానికి వస్తున్నట్లు ప్రకటించారు. నేడు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తుంది.
సత్యసాయి జిల్లా కదిరి రైల్వే స్టేషన్ వద్ద.. నాగర్ కోయిల్-ముంబయి రైలు వచ్చే సమయంలో గేట్మెన్ గేటు వేయలేదు. అది గమనించని వాహనాదారులు అలానే రైల్వ్ ట్రాక్ దాటుతున్నారు. ఇంతలోనే ట్రైన్ దగ్గరికొస్తుంది. అది గమనించిన లోకో పైలట్ అప్రమత్తతతో వెంటనే రైలును ఆపేశాడు. దీంతో వాహనాదారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే గేట్మెన్ నిర్లక్ష్యంపై అటు వాహనాదారులు, స్థానికులు తీవ్రంగా ఫైరవుతున్నారు.
ఏపీలో రేపటి(శనివారం)నుంచి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. 6,455 మంది అభ్యర్ధులు ఈ పరీక్షకు హాజరుకానున్నారు. ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటలలోపు అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు అధికారులు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనుంది. జూన్ 10 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తమ పార్టీ ఇన్ ఛార్జ్ లను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. వచ్చే ఏడాది ఏపీలో ఎన్నికలు జరుగనున్న నేథప్యంలో ఇన్ చార్జ్ లను కేటాయించారు. దీంతో పార్టీని మరింత బలపర్చాలని బీజేపీ భావిస్తోంది.
చంద్రబాబు తన రాజకీయ జీవితంలో, ఇన్నాళ్లూ పేదల పట్ల, బడుగుల పట్ల ప్రదర్శించిన నిరంకుశమైన ఆలోచనసరళికి తగిన సమాధానం చెప్పిన తర్వాతనే, ఆయన పేదల పల్లెల్లో పర్యటించాలని మంత్రి మేరుగు నాగార్జున డిమాండ్ చేశారు.