గత 20 రోజులుగా ఆకాశాన్నంటిన టమాటా ధరలు దిగొస్తున్నాయి. దేశవ్యాప్తంగా టమాటా ధరలు కేజీ రూ. 200 నుండి 250 పలికాయి. తాజాగా టమాటా ధరలు భారీగా తగ్గుముఖం పట్టాయి. మరీ ముఖ్యంగా ఏపీలో అయితే చాలా వరకు ధరలు తగ్గాయి. అన్నమయ్య జిల్లా మదనపల్లె మార్కెట్ టమాటాలకు ఫేమస్ అని అందరికి తెలిసిన విషయమే.. అక్కడ కేజీ టమాటా ధర రూ.33 పలుకుతోంది. మరోవైపు చిత్తూరు, అనంతపురం, కర్నూలు మార్కెట్‌లలో ఇలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి.
Supreme Court: అణిచివేత సందేశాన్ని పంపేందుకే లైంగిక హింస.. మణిపూర్ కేసులపై సుప్రీంకోర్టు
భారీగా దిగుబడి వస్తుండటంతో టమాటా ధరలు తగ్గుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. చిత్తూరు జిల్లాతో పాటుగా పక్క జిల్లాల్లో, పొరుగు రాష్ట్రాల్లో టమోటా దిగుబడి పెరిగింది. దీంతో టమాటా భారీగా మార్కెట్‌కు వస్తోంది. టమాటా కోసం బయ్యర్ల పోటీ పడకపోతుండటంతో.. గిరాకీ తగ్గి టమాటా ధర పడిపోతోందని తెలుపుతున్నారు. మరోవైపు టమాటా ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుతుండటంతో సామాన్యులకు ఊరటనిచ్చే అంశం కాగా.. రైతులకు మాత్రం బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.
Geetha Madhuri: హాట్ లుక్ లో సింగర్ గీతా మాధురి.. హీరోయిన్ గా ఏమైనా ట్రై చేస్తున్నావా.. ?
టమాటా ధరలు పెరగడంతో కొందరు రైతులు భారీ లాభార్జన పొందారు. కొందరు అన్నదాతలు ఏకంగా కోటీశ్వరులయ్యారు. మొన్నటి వరకు భారీ లాభాలు పొందిన రైతులు.. ఇప్పుడు దారుణంగా తగ్గిపోతుండటంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతవారం కిలో రూ. 200 పలకగా.. ఇంకా ధరలు పెరుగుతాయనే భయం ఉండేది. కానీ టమాట దిగుబడి పెరగడంతో రెండ్రోజుల్లోనే పరిస్థితి తారుమారైంది.