దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2019 నుంచి 2021 మధ్య మహిళలు, బాలికల మిస్సింగ్ పై ఇవాళ రాజ్యసభకు కేంద్ర హోంశాఖ వివరాలు వెల్లడించింది. రాజ్యసభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్రహోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో గడిచిన మూడేళ్లలో 72,767 మంది అదృశ్యం అయినట్లు కేంద్రం తెలిపింది.
Flower Cultivation: రైతు ఆదాయాన్ని పెంచుతున్న పూల సాగు..!
ఏపీలో 2019 నుంచి 2021 వరకు మూడేళ్ల కాలంలో మొత్తం 7,928 బాలికలు.. 22,278 మహిళలు అదృశ్యమైనట్లు పేర్కొంది.
2019లో 2,186 బాలికలు 6,252 మహిళలు
2020లో 2,374 బాలికలు 7,057 మంది మహిళలు
2021లో 3,358 బాలికలు, 8,969 మంది మహిళలు అదృశ్యమైనట్లు కేసులు నమోదైనట్లు పేర్కొంది.
Heavy Rain: దేశ వ్యాప్తంగా వర్ష బీభత్సం.. పలు ప్రాంతాలకు హెచ్చరికలు
అటు తెలంగాణలో సైతం మహిళలు, బాలికల మిస్సింగ్ కేసులు మరింత ఎక్కువగా ఉన్నట్లు హోంశాఖ గణాంకాలు వెల్లడించాయి. 2019 నుంచి 2021 వరకు మూడేళ్లలో తెలంగాణలో మొత్తం 8,066 మంది బాలికలు, 34,495 మహిళలు అదృశ్యమయ్యారు.
2019లో 2,849 మంది బాలికలు, 10,744 మహిళలు
2020లో 2,232 మంది బాలికలు, 10,917 మంది మహిళలు
2021లో 2,994 మంది బాలికలు 12,834 మంది మహిళలు మిస్సయినట్లు కేసులు నమోదయ్యాయని కేంద్రం తెలిపింది.
Varun Tej: మెగా ప్రిన్స్.. బాలీవుడ్ హాట్ బ్యూటీతో రొమాన్స్ అంటే.. మాములుగా ఉండదేమో
మరోవైపు ఏపీలో భారీ ఎత్తున మహిళలు అదృశ్యం కావడానికి వాలంటీర్లు తీసుకుంటున్న డేటాయే కారణమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గతంలో ఆరోపించారు. దీనిపై ప్రభుత్వంతో పాటు మహిళా కమిషన్ కూడా తీవ్రంగా స్పందించాయి. పవన్ కేంద్ర ఇంటిలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం తాను చెప్పానని చెప్పడాన్నీ తప్పుబట్టాయి. ఐబీ పవన్ కళ్యాణ్ కు డేటా ఎలా ఇచ్చిందని కూడా ప్రశ్నించాయి. మరి ఇప్పుడు కేంద్రమే పార్లమెట్ సాక్షిగా అదృశ్యమైన వారి వివరాలు తెలిపింది. మరి దీనికి వైసీపీ నేతలు ఏమని సమాధానం చెపుతారని జనసేన శ్రేణులు ప్రశ్నిస్తున్నారు.