AP weather Update Today: కరువు భయం కమ్ముకున్న వేళ ఆంధ్రప్రదేశ్ రైతులకు గుడ్ న్యూస్. గురు, శుక్రవారాల్లో ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాదు రాష్ట్రంకు వారం రోజుల పాటు వర్ష సూచన ఉన్నట్లు పేర్కొంది. ఆగ్నేయ ఉత్తరప్రదేశ్ వద్ద కొనసాగుతున్న అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని విశాఖ వాతావరణ అధికారులు తెలిపారు. ఇప్పటికే ఏపీలోని కొన్ని జిల్లాలో వాతావరణం చల్లబడింది. అక్కడక్కడా చిరు జల్లులు పడుతున్నాయి. Also…
తెలుగు రాష్ట్రాలపై ‘కరువు’ మేఘం కమ్మేస్తోంది. బ్రేక్ మాన్ సూన్ తరహా వాతావరణం కలవరపాటుకు గురిచేస్తోంది. సీజన్లో అత్యంత కీలకమైన జూలై తీవ్ర నిరాశపరిచింది. ఇప్పటికే 10 శాతం వర్షపాతం లోటు నమోదవ్వగా.. వచ్చే వారం పది రోజులు చాలా కీలకమని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈలోగా వర్షాలు కురిసి సాధారణ స్ధితికి రాకపోతే పంటలు దెబ్బతినే అవకాశాలు బాగా పెరుగుతాయి. ఈ ఏడాది 9 రోజులు ముందుగానే రుతుపవనాలు వచ్చినప్పటికీ రైతులకు అవసరం అయిన సమయంలో…
: ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాజిల్లాలకు మరో రెండు రోజులు భారీ వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. రుతుపవనాలు యాక్టివ్ గా వుండటం, ఆవర్తనాల ప్రభావంతో సముద్ర ఉపరితలంపై బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. మత్స్యకారుల వేటను నిషేధించారు. అటు, పశ్చిమ బెంగాల్ దగ్గర నిన్న అర్ధరాత్రి తీరం దాటిన తీవ్ర వాయుగుండం బంగ్లాదేశ్ వైపు తరలిపోయి అల్ప పీడనంగా బలహీన పడుతోంది... వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తెలుగు రాష్ట్రాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపించకుండానే తీరాన్ని దాటిపోయింది.
ఈశాన్య రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.. మరోవైపు, వాయువ్య బంగాళాఖాతం ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం.. ఉత్తరదిశగా కదులుతూ వచ్చే 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని.. 29న వాయుగుండంగా మారేందుకు ఛాన్స్ ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎంపీ రోణంకి కూర్మనాథ్.. రాష్ట్రంలో చెదురుమదురుగా భారీ వర్షాలతో పాటుగా, కొన్నిచోట్ల 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం…
నైరుతి రుతుపవనాలు కేరళతో పాటు గోవా, కర్ణాటక, మహారాష్ట్ర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్‌లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించాయి. రాగల మరికొద్ది గంటల్లో రాయలసీమను నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. వారం రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతటా విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తెలిపింది. దాంతో రానున్న మూడు రోజుల పాటు ఏపీలో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఇప్పటికే ఉత్తర కోస్తా జిల్లాల్లో వానలు, ఈదురు గాలులు కొనసాగుతున్నాయి. వారం రోజుల…
తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా ఉత్తర కర్ణాటక-గోవా తీరాల నుండి కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి 3.1కి.మీ ఎత్తు వరకు ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజులు మేఘావృతమైన వాతావరణంతో పాటు చెదురుమదురుగా భారీవర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. గంటకు 40-50 కిమీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు…
ఏపీలో నేడు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశముంది. పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నాయని వాతావరణ అధికారులు చెప్పారు. విజయనగరం, మన్యం, ఏలూరు, కర్నూలు, నంద్యాల జిల్లాలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు. Also Read: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే? తూర్పుగోదావరి, ప్రకాశం, వైఎస్సార్, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు కురుస్తాయని వాతావరణ శాఖ…
ఏపీలో వర్షం దంచికొడుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంది. గంటకు 60-85 కిమీ వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని సంస్థ వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు, విజయనగరం, అనకాపల్లి పలుచోట్ల అరెంజ్…
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఈరోజు ఉదయం అల్పపీడనంగా బలహీనపడింది.. ఇక, అల్పపీడనం మరింత బలహీన పడి ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది.. దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి.. గంటకు 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి..
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం నేడు బలహీనపడే అవకాశం కనిపిస్తోంది. ఇది పశ్చిమ నైరుతి దిశగా కదులుతోందని వాతావరణశాఖ చెబుతోంది. ఉత్తర భారతం మీదుగా వెళుతున్న పశ్చిమ ద్రోణి అల్పపీడనాన్ని, తేమను తనవైపు లాగడానికి ప్రయత్నిస్తోంది. దీని ప్రభావంతో మరో మూడు రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయి. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలకు అవకాశం ఉంది.