Weather Update: ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తాజిల్లాలకు మరో రెండు రోజులు భారీ వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. రుతుపవనాలు యాక్టివ్ గా వుండటం, ఆవర్తనాల ప్రభావంతో సముద్ర ఉపరితలంపై బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. మత్స్యకారుల వేటను నిషేధించారు. అటు, పశ్చిమ బెంగాల్ దగ్గర నిన్న అర్ధరాత్రి తీరం దాటిన తీవ్ర వాయుగుండం బంగ్లాదేశ్ వైపు తరలిపోయి అల్ప పీడనంగా బలహీన పడుతోంది… వాయువ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తెలుగు రాష్ట్రాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపించకుండానే తీరాన్ని దాటిపోయింది. నిన్న అర్ధరాత్రి తర్వాత పశ్చిమ బెంగాల్ దగ్గర తీరాన్ని తాకి క్రమేపీ బలహీనపడుతూ బంగ్లాదేశ్ వైపు పయనిస్తోంది.
Read Also: Police Complaint : ‘పోలీస్ కంప్లెయింట్’ ఇస్తానంటున్న వరలక్ష్మి శరత్ కుమార్
మరోవైపు, నైరుతి యాక్టివిటీ, ఆవర్తనాల ప్రభావంతో ఏపీలో దక్షిణ, ఉత్తర కోస్తా జిల్లాలకు భారీ వర్ష హెచ్చరికలు జారీ అయ్యాయి. పల్నాడు, బాపట్ల, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో వచ్చే రెండురోజుల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే చాన్స్ వుంది. ఇక, మిగిలిన ప్రాంతాల్లో చెదురు మదురు నుంచి ఒక మోస్తరు వానలు పడతాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం తెలిపింది. మాన్ సూన్ అసోసియేటెడ్ విండ్ గ్రేడియంట్ బలంగా వుంది. దీని ప్రభావంతో సముద్ర ఉపరితలంపై గరిష్టంగా 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. దీంతో సాగరం కల్లోలంగా వుంది. తీరం వైపు భారీ కెరటాలు విరుచుకుపడుతున్నాయి. పెద్ద ఎత్తున తీరం కోతకు గురవుతుంది.. మరో రెండు రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దనే హెచ్చరికలు జారీ అయ్యాయి. విశాఖ నగరంలో భారీ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండగా.. వచ్చే రెండు రోజులు ఇదే వాతావరణం కొనసాగే సూచనలు వున్నాయి. క్రమేపీ పగటి ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ చెబుతోంది.
Read Also: PCC Chief Mahesh Goud: ఈటల రాజేందర్, హరీష్ రావు ఫామ్ హౌస్‌లో సీక్రెట్‌గా కలిశారు..
ఇక, ఇవాళ సాయంత్రం 5 గంటల నాటికి విజయనగరం జిల్లా గుర్లలో 87.5 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా.. వైఎస్ఆర్ కడప జిల్లా సెట్టివారిపల్లిలో 87.5 మిమీ, విజయనగరం జిల్లా వేపాడలో 79.2 మి.మీ, నంద్యాల జిల్లా ముత్యాలపాడులో 79 మిమీ, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 74 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది..