బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. రానున్న మూడు గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. అంతేకాదు పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్ల క్రింద ఉండకూడని, ఇంట్లోనే సురక్షితంగా ఉండండని ప్రజలకు సూచించారు. వర్షాల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. ఈ…
Cyclone: ఆంధ్రప్రదేశ్‌కు వాయుగుండం గండం తప్పినట్టు అయ్యింది.. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్తా వాయుగుండంగా మారి తెల్లవారు జామున తీరం దాటింది.. గోపాల్ పూర్ సమీపంలో తీరాన్ని దాటి బలహీన పడుతోంది వాయుగుండం.. దీంతో, అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.. అయితే, ఈ ప్రభావంతో ఇవాళ నెల్లూరు మినహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుయనున్నాయి.. ఇదే సమయంలో, సముద్రం కల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో.. మరో రెండు రోజులు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.. మరోవైపు,…
ఉత్తరాంధ్రకు వాయుగుండం ముప్పు పొంచి ఉంది. మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఈరోజు రాత్రికి వాయుగుండంగా బలపడుతుంది. రేపు ఉదయం దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటుతుందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. తీరం వెంబడి 50 నుంచి 60 కిమీ గరిష్ఠ వేగంతో ఈదురుగాలు వీస్తుండగా.. సముద్రం అలజడిగా మారింది. వాయుగుండం ప్రభావంతో రాగల 48 గంటలు ఉత్తర, దక్షిణ కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురవనున్నాయి. Also…
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి భారీ వర్షాలు కురవబోతున్నాయి.. వాయువ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా.. ఉత్తర కోస్తా మీదగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.. ఇది సముద్ర మట్టం నుంచి 4.5 కిలోమీటర్లు ఎత్తు లో ఆవరించి ఉందని.. దీని ప్రభావంతో రాగల ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది విశాఖపట్నం వాతావరణం కేంద్రం..
వాయువ్య బంగాళాఖాతంలో ఒడిషా-పశ్చిమ బెంగాల్ తీరాలను ఆనుకు అల్పపీడనం ఏర్పడింది. క్రమేపీ బలపడి తీవ్ర అల్పపీడనంగా రూపాంతరం చెందుతుందని ఐఎండీ ప్రకటించింది. అల్పపీడన ప్రాంతం నుంచి రుతుపవన ద్రోణి ఒకటి సంబల్పూర్ మీదుగా వ్యాపించింది.
బంగాళాఖాతంలో వాయుగుండం ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో కుండపోత వానలతో వాగులువంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రోడ్లు కాలువలను తలపిస్తుండగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో అల్లూరి ఏజెన్సీలో బాహుబలి సీన్ రిపీట్ అయ్యింది. బిడ్డను బుజాన ఎత్తుకుని పీకల్లోతు వాగు దాటాడు ఓ గిరిజనుడు. పెదబయలు పెదకొండపల్లి పంచాయితీ చెక్కరాయి వద్ద తన బిడ్డను బుజాన ఎక్కించుకొని పీకల్లోతు వాగు దాటాడు. వాగులోంచి…
నేడు పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఏపి రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో నేడు, రేపు కోస్తాంధ్రలో పలుచోట్ల అతిభారీ వర్షాలు కురవనున్నాయి. ఇవాళ పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు పడనున్నాయి. గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. గంటకు 40 -50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని హెచ్చరించారు.…
AP Weather Alert: ఏపీకి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. పల్నాడు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షం పడే ఛాన్స్ ఉంది. తిరుపతి, కడప, నంద్యాల, సత్యసాయి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. దీంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. జనాలకు కీలక సూచనలు చేస్తున్నారు.
Wipha Cyclone: మరో 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ తెలిపింది. విఫా తుఫాన్ చైనా, హాంకాంగ్ ప్రాంతాల్లో బీభత్సం సృష్టించిన తర్వాత.. అది తీరం దాటి బంగాళాఖాతంలోకి ప్రవేశించడంతో.. ప్రస్తుతం ఇది తుఫానుగా మారిపోయింది.