Heavy Rains: ఈశాన్య రుతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.. మరోవైపు, వాయువ్య బంగాళాఖాతం ఒడిశా తీరంలో ఏర్పడిన అల్పపీడనం.. ఉత్తరదిశగా కదులుతూ వచ్చే 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉందని.. 29న వాయుగుండంగా మారేందుకు ఛాన్స్ ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎంపీ రోణంకి కూర్మనాథ్.. రాష్ట్రంలో చెదురుమదురుగా భారీ వర్షాలతో పాటుగా, కొన్నిచోట్ల 50-60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు..
Read Also: Realme Buds Air 7 Pro: 48 గంటల ప్లేబ్యాక్ తో.. రియల్‌మీ కొత్త ఇయర్‌బడ్స్ విడుదల
శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, ఏలూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, శ్రీసత్యసాయి జిల్లాల్లో రేపు అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.. ఇక, ఎల్లుండి అనగా గురువారం రోజు పార్వతీపురంమన్యం, అల్లూరిసీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అలాగే మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.. మరోవైపు.. మంగళవారం సాయంత్రం 5గంటల నాటికి అనకాపల్లి జిల్లా పాములవాకలో 46.5 మిమీ, నరసింగపల్లిలో 41.2 మిమీ, యలమంచిలిలో 40.7మిమీ, అల్లూరి జిల్లా అనంతగిరి 37.5మిమీ, అనకాపల్లిలో 29మిమీ చొప్పున వర్షపాతం నమోదైనట్టు వెల్లడించారు..