పశ్చిమ మధ్య, దానిని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడు తీరాల వెంబడి ఈ అల్పపీడనం కొనసాగుతోంది. రాగల 24 గంటలలో నైరుతి బంగాళాఖాతం, దానిని నానుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో బలహీనపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురవనున్నాయి. నేడు అల్లూరి అనకాపల్లి, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాలలో ఒకటి రెండు…
పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. అయితే, ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొది.. విశాఖ పోర్టులో మూడో నెంబర్ సాధారణ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంగా.. మూడు రోజుల పాటు.. అంటే గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు వాతావరణశాఖ అధికారులు..
పశ్చిమ బంగాళాఖాతంలో అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అల్పపీడనం పశ్చిమ-నైరుతి దిశగా కదులుతూ రేపటికి ఉత్తర తమిళనాడు, ఏపీలోని దక్షిణ కోస్తా తీరాల వైపు వెళ్తుందని పేర్కొంది. దీని ప్రభావంతో సోమవారం నుంచి గురువారం వరకు 4 రోజుల పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు అంచనా వేశారు.…
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి.. ఈ నేపథ్యంలో.. తాజా పరిస్థితులపై భారత వాతావరణ శాఖ రిపోర్ట్ విడుదల చేసింది. రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని పేర్కొంది..
తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఉమ్మడి విశాఖ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి. అల్పపీడనం తీరానికి సమాంతరంగా వెళుతున్న కారణంగా మరో రెండు రోజుల పాటు భారీ వర్షాల హెచ్చరికలు ఉండడంతో.. రైతుల్లో టెన్షన్ పెరుగుతోంది. కోత కోసి పొలాలలో ఆరబెట్టిన వరి పంట దెబ్బతింటుందని రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికే కొన్ని చోట్ల మొలకలు వచ్చే పరిస్థితి నెలకొంది. పాయకరావుపేట, ఎలమంచిలి, అనకాపల్లి, చోడవరం, మాడుగుల నియోజకవర్గాలలో వర్షాలు…
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని.. ముఖ్యంగా కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది విశాఖ వాతావరణ కేంద్రం.. నైరుతి బంగాళాఖాతం దాన్ని అనుకోని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోందని.. రానున్న 24 గంటల్లో వాయువ్య దిశగా పయనిస్తోందని.. దీని ప్రభావంతో నెల్లూరు నుంచి విజయనగరం జిల్లా వరకు కోస్తా అంతటా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు వీడడం లేదనే చెప్పాలి.. వరుసగా బంగాళాఖాతంలో అల్పపీడనాలు.. వాటి ప్రభావంతో.. పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి.. మొన్నటి వరకు పలు ప్రాంతాల్లో వర్షాలు కురవగా.. మరో నాలుగు రోజుల పాటు ఏపీలో వర్షాలు కురుస్తాయని జాతీయ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడుతోంది. దీని ప్రభావంతో రాగల రెండు రోజుల్లో తమిళనాడు తీరానికి చేరుకుంటుందని ఐఎండీ అంచనా వేసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడింది.. క్రమంగా శ్రీలంక-తమిళనాడు తీరాల వైపు కదులుతోంది.. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించిందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ప్రభావంతో.. ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.. చిత్తూరు జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లాలోని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్..
AP Rains : బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ ప్రభావంతో ఈరోజు తెల్లవారుజామున నుంచి ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. నెల్లూరు.. కోవూరు.. అల్లూరు.. వాకాడు..కోట. ముత్తుకూరు మండలాల్లో కొనసాగుతోంది. తీర ప్రాంతంలో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండడంతో.. బీచ్ ల వద్దకు ప్రజలు వెళ్ళవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. తుఫాను తీరం దాటే సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార…
బుధవారం రాత్రికి తుఫాన్గా బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. ఆ తదుపరి 2 రోజులలో ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ శ్రీలంక తీరాన్ని దాటి తమిళనాడు తీరం వైపు వెళ్ళేందుకు అవకాశం ఉందని.. దీని ప్రభావంతో గురు, శుక్ర, శనివారాల్లో అంటే ఈ నెల 28, 29, 30 తేదీల్లో కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, రాయలసీమలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఈ 3 రోజులు మిగిలినచోట్ల విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తరు…