కాకినాడ జీజీహెచ్ లోనే డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహం వుంది. పోస్ట్ మార్టం ఇంకా పూర్తికాలేదు. ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్టు చేస్తే తప్ప పోస్ట్ మార్టం చేయడానికి అంగీకరిస్తూ సంతకం చేసేది లేదని అంటున్నారు కుటుంబ సభ్యులు. దీంతో జీజీహెచ్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. నిన్న అంతా కాకినాడ జీజీహెచ్ లో హై డ్రామా కొనసాగింది. నిన్న ఉదయం 11 గంటల నుంచి మార్చురీ లోనే ఉంది సుబ్రహ్మణ్యం మృతదేహం. కాకినాడ టూ టౌన్…
ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ వార్ నడుస్తోందా? టీడీపీ నేతల వరుస అరెస్ట్ లు దానికి సంకేతమా? అంటే అవుననే అనిపిస్తోంది. కడప, అనంతపురం పర్యటనల్లో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు టీడీపీ నేతల్ని వేధించడంపై మండిపడ్డ సంగతి తెలిసిందే. తాజాగా విజయవాడ శివారులో టీడీపీ నేతను పోలీసులు అరెస్ట్ చేయడం కలకలం రేపుతోంది. గొల్లపూడిలో టీడీపీ నాయకుడు ఆలూరి హరికృష్ణ చౌదరి చిన్నాను అరెస్ట్ చేశారు పోలీసులు. శుక్రవారం అర్ధరాత్రి చిన్నాని అరెస్ట్ చేసి వన్ టౌన్…
యువీ రమణమూర్తి రాజు అలియాస్ కన్నబాబు. యలమంచిలి ఎమ్మెల్యే. ఉమ్మడి విశాఖజిల్లా వైసీపీ కీలక నేతల్లో ఒకరు. కుండబద్దలు కొట్టేసినట్టు మాట్లాడే ఆయన వైఖరి సొంత పార్టీని, యంత్రాంగాన్ని ఇబ్బందులోకి నెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ క్షత్రియ సామాజికవర్గానికి బలమైన ఓటు బ్యాంకు లేనప్పటికీ 2004-2014మధ్య వరసగా రెండుసార్లు కాంగ్రెస్ నుంచి.. 2019లో వైసీపీ తరఫున ఎమ్మెల్యే అయ్యారు. కాంగ్రెస్ నుంచి వైసీపీలోకి మారే మధ్యలో టీడీపీ కండువా కప్పుకొన్నా.. అంతర్గత కారణాలతో అక్కడ ఎక్కువ కాలం…
కాకినాడ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ డెడ్ బాడీ కలకలం రేపుతోంది? అసలేం జరిగిందనేది హాట్ టాపిక్ అవుతోంది. మృతుడు సుబ్రహ్మణ్యం భార్య తో ఫోన్ లో మాట్లాడారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడలో అధికారపార్టీ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ బాబు కారులో డ్రైవర్ మృతదేహం కలకలం రేపుతోంది. మృతదేహం ఎమ్మెల్సీ దగ్గర పనిచేసే డ్రైవర్ సుబ్రమణ్యంది గుర్తించారు. గురువారం ఉదయం ఎమ్మెల్సీ ఉదయ్ బాబు…
వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటింది. ఈ మూడేళ్లు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని నందికొట్కూరు, కోడుమూరు నియోజకవర్గాల్లో వైసీపీ అంతర్గత కుమ్ములాటలతోనే కాలం గడిచిపోయింది. పార్టీ నేతలే కొట్టుకోవడం, కేసులు పెట్టుకోవడం..కామన్‌గా మారింది. నందికొట్కూరులో ఎమ్మెల్యే ఆర్థర్, శాప్ చైర్మన్ బైరెడ్డి సిధార్థ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్న సంగతి తెలిసిందే. ఇక్కడ వర్గపోరు రక్తపోరుగా మారడానికి గీతలేవీ లేవు. సమయం సందర్భం వస్తే వైరిపక్షాలుగా మారి ఘర్షణ పడుతుంటారు. నందికొట్కూరు వైసీపీలో విభేదాలను పరిష్కరించడానికి…
సీదిరి అప్పలరాజు. కాకినాడ జిల్లా ఇంఛార్జి మంత్రి. ఇంఛార్జ్ మినిస్టర్‌గా బాధ్యతలు చేపట్టాక.. జిల్లా సమావేశాలలో ఆయన తీరు ప్రశ్నగా మారింది. అధికారులను ఇరుకున పెడదామని ఆయన చేస్తున్న ప్రయత్నాలు చర్చగా మారుతున్నాయి. తాను స్పెషల్‌గా కనిపించాలనో ఏమో ప్రతి చిన్న విషయానికీ గంటల తరబడి సుదీర్ఘ ప్రసంగాలు చేస్తున్నారట. ఎవరైనా అధికారులు మంత్రి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పబోతుంటే.. ఐ నో ఎవ్రీథింగ్.. ప్లీజ్ సిట్ డౌన్.. అని ఇంగ్లీష్‌లో ఏకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నట్టు చెవులు…
ఏపీలో ముందస్తు ఎన్నికలకు రంగం సిద్ధమవుతోందా? జగన్ ముందస్తుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రతిపక్షాలకు చిక్కకుండా ఉండేందుకు రెండు అడుగులు ముందే ఉండాలని.. రెండేళ్ల ముందే ఎన్నికలకు వెళ్లాలనుకుంటున్నారా? జగన్ ముందస్తు ఎన్నికల ప్రిపరేషన్ చేస్తున్నారంటూ టీడీపీ మైండ్ గేమ్ ఆడుతోందా? ప్రభుత్వ పని అయిపోయింది కాబట్టే ముందస్తుకు ప్లాన్ వేస్తున్నారనే కృత్రిమ చర్చకు శ్రీకారం చుడుతున్నారా? అసలు ముందస్తుతో మాకేం పనంటున్న అధికార పార్టీది నిజంగా ధీమానేనా? అంతర్గతంగా రెఢీ అవుతోందా? ఏపీలో అసలేం జరుగుతోంది? ఇంకా…
కోనసీమ జిల్లా వైసీపీలో అంతర్గత విభేదాలు గోదావరి జిల్లాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మాజీ మంత్రి కుడుపూడి చిట్టాబ్బాయి వర్థంతి సభలో జరిగిన పరిణామాల తర్వాత రాజకీయం వాడీవాడీగా ఉంది. శెట్టిబలిజ సామాజికవర్గానికి చెందిన అధికారపార్టీలో కీలక నేతల మధ్య మాటల యుద్ధం రకరకాల మలుపులు తిరుగుతోంది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఎదుట మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ మోకాళ్లపై కూర్చుని కృతజ్ఞతలు తెలియజేయడం మంత్రి సొంత సామాజికవర్గానికి చెందిన కొందరికి రుచించలేదు. వైసీపీలోనే ఉన్న ఆ…
బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య. తెలుగు రాష్ట్రాల్లోని వెనకబడిన తరగతులకు.. రాజకీయ పార్టీలకు ఆయన సుపరిచితం. అలాంటి నాయకుడు ఒక్కసారిగా ఏపీ, తెలంగాణలో చర్చగా మారారు. దానికి కారణం ఆయన్ను రాజ్యసభకు వైసీపీ ఎంపిక చేయడమే. ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి ఆర్ కృష్ణయ్యకు ఇస్తారనే చర్చ జరుగుతున్న సమయంలోనే ఆయన తాడేపల్లిలో కనిపించారు. వైసీపీ పెద్దలతో భేటీ అయ్యారు. బీసీల సంక్షేమం .. హక్కుల సాధన కోసం…
ఏపీలో మూడేళ్ల తర్వాత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన పెద్ద కార్యక్రమం గడప గడపకు మన ప్రభుత్వం. ఈ రెండేళ్లూ పార్టీతోపాటు నేతలు ప్రజల్లోనే ఉండేలా ప్రొగ్రామ్‌ను నిర్దేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు ఇంటింటికీ తిరిగి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే నెలకు పది గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో తిరగాల్సి ఉంటుంది. ఒక్కో సచివాలయ పరిధిలో రెండు రోజులు పర్యటించాలి. వలంటీర్లతోపాటు.. సచివాలయ సిబ్బంది వారి వెంటే ఉండాలి. అధినేత ఆదేశించగానే మెజారిటీ…