అమలాపురం వ్యవహారంలో మంత్రుల తీరుపై పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. హోం మంత్రి వనిత మా పేరు వివాదంలోకి లాగారు. హోం మంత్రి వ్యాఖ్యలకు మేం ఆశ్చర్యపోతున్నాం. తల్లి పెంపకం సరిగా ఉండాలంటూ హోం మంత్రి కామెంట్ చేశారు. ఆరేళ్ల బిడ్డ కూడా అత్యాచారానికి గురైతే తల్లుల పెంపకమే తప్పా..? ఎస్సీల మీదే అట్రాసిటీ కేసులు పెట్టించిన ఘనత జగన్ ప్రభుత్వానిది. దళితులపై దాడులు జరుగుతున్న దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ నెంబర్-1గా నిలిచిందని రామ్ దాస్ అథవాలే స్వయంగా స్పష్టం చేశారు. వాళ్ల ఇళ్ల మీద వాళ్లే దాడులు చేయించున్నారు. కోనసీమలో డిజైన్డు గొడవలు జరగాలని ప్రభుత్వం కోరుకుంది. వివేకా హత్య విషయంలో గుండె పోటు నుంచి గొడ్డలి దాకా తెచ్చారు. కోడి కత్తి విషయంలో ఏం విచారణ జరిపారు.. ఎందుకు శిక్షలు వేయలేదని పవన్ ప్రశ్నించారు.
ఆ కోడి కొత్తి ఎపిసోడులో కీలకంగా ఉన్న వారికి కీలక పదవులు ఎందుకిచ్చారు..?ఇన్ని తప్పులు ప్రభుత్వం కింద ఉంచుకుని మాపై ఆరోపణలు చేస్తారా..? కులాలు కలిసి ఉండాలని కోరుకునేవాళ్లం మేం.. మీరా మాకు చెప్పేది. కులాల ఘర్షణకు వైసీపీనే బాధ్యత వహించాలి. గతంలో తునిలో రైలును తగుల పెట్టించిన వైసీపీ వేరే వారి మీదకు తోసేసింది. ఇప్పుడు స్వయంగా మంత్రి ఇంటినే తగులబెట్టించారు.మంత్రులు బాధ్యతగా ఉండాలి.. నోటికి ఏది వస్తే అది మాట్లాడొద్దు. మంత్రులు ఏదైనా మాట్లాడాలంటే ఆలోచించి మాట్లాడాలన్నారు పవన్ కళ్యాణ్.
సజ్జల వంటి మేధావులు రాష్ట్రాభివృద్ధి కోసం మేధావితనం ఉపయోగిస్తే బాగుంటుంది. మంత్రులను బాధ్యతతో ఉండాలని సజ్జల చెప్పాలి.మంత్రులు సహా ఎవ్వరు చెప్పినా నిబంధనలకు విరుద్దంగా ఐఏఎస్సులు వ్యవహరించకూడదు.గొడవలు జరిగితే అధికారులదే బాధ్యత ఉంటుంది.అంబేద్కర్ వంటి మహానుభావుడిని ఓ జిల్లాకు పరిమితం చేస్తే సరిపోతుందా..?కులాలు కలవకూడదనే ఉద్దేశ్యం కొందరు రాజకీయ పార్టీలు కోరుకుంటున్నాయి.మంత్రులుగా ఉండి మాట్లాడితే నిజమైపోతుందా..?కూర్చొన్న చెట్టునే నరుక్కునే వాళ్లు ఉంటారు.అధికారం కోసం ఏం చేయడానికైనా సిద్దపడొచ్చన్నారు పవన్ కళ్యాణ్.
Pawan Kalyan: కోనసీమలో కావాలనే చిచ్చుపెట్టారు