బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత ఆర్ కృష్ణయ్య. తెలుగు రాష్ట్రాల్లోని వెనకబడిన తరగతులకు.. రాజకీయ పార్టీలకు ఆయన సుపరిచితం. అలాంటి నాయకుడు ఒక్కసారిగా ఏపీ, తెలంగాణలో చర్చగా మారారు. దానికి కారణం ఆయన్ను రాజ్యసభకు వైసీపీ ఎంపిక చేయడమే. ఏపీలో ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒకటి ఆర్ కృష్ణయ్యకు ఇస్తారనే చర్చ జరుగుతున్న సమయంలోనే ఆయన తాడేపల్లిలో కనిపించారు. వైసీపీ పెద్దలతో భేటీ అయ్యారు. బీసీల సంక్షేమం .. హక్కుల సాధన కోసం…
ఏపీలో మూడేళ్ల తర్వాత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన పెద్ద కార్యక్రమం గడప గడపకు మన ప్రభుత్వం. ఈ రెండేళ్లూ పార్టీతోపాటు నేతలు ప్రజల్లోనే ఉండేలా ప్రొగ్రామ్‌ను నిర్దేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్‌లు ఇంటింటికీ తిరిగి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తున్నారు. ప్రతి ఎమ్మెల్యే నెలకు పది గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో తిరగాల్సి ఉంటుంది. ఒక్కో సచివాలయ పరిధిలో రెండు రోజులు పర్యటించాలి. వలంటీర్లతోపాటు.. సచివాలయ సిబ్బంది వారి వెంటే ఉండాలి. అధినేత ఆదేశించగానే మెజారిటీ…
ఎస్సీ మహిళ వెంకాయమ్మకు రక్షణ కల్పించాలని గుంటూరు ఎస్పీకి టీడీపీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడు లేఖ రాశారు. వైసీపీ ప్రభుత్వంపై అసంతృప్తిని తెలిపిన ఎస్సీ మహిళ వెంకాయమ్మకు రక్షణ కల్పించాలని లేఖలో కోరిన అచ్చెన్న.లేఖలో కోరిన అచ్చెన్న.వైసీపీ ప్రభుత్వంపై ప్రజాస్వామ్యబద్ధంగా తమ అసమ్మతి తెలుపుతున్న వారిపై దాడికి పాల్పడుతున్నారు.రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నారు.ప్రభుత్వం పై తన అసమ్మతి తెలిపిన ఎస్సీ-మాల సామాజిక వర్గానికి చెందిన వెంకాయమ్మపై జరిగిన దాడే ఇందుకు…
సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు అమెరికా కాన్సుల్ జనరల్ ( హైదరాబాద్) జోయల్ రీఫ్‌మెన్. జోయల్ రీఫ్‌మెన్ తన ఫేర్వెల్ విజిట్‌లో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అమెరికా – ఆంధ్ర సంబంధాలు మెరుగుపరచడం కోసం, అమెరికా కాన్సులేట్‌కు సీఎం ఇచ్చిన సహకారం, చొరవకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఏపీ ప్రభుత్వానికి అమెరికన్ కాన్సులేట్‌కు సత్సంబంధాలు మరింత మెరుగుపడడంలో సీఎం చేసిన కృషిని కొనియాడారు. విద్యా…
నగరి ఎమ్మెల్యే నుంచి మంత్రి స్థాయికి ఎదిగిన ఆర్ కె రోజా బిజీబిజీగా మారిపోయారు. రోజుకో జిల్లాలో పర్యటిస్తూ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అప్పుడప్పుడూ ఆటల పోటీల్లో పాల్గొంటున్నారు. మంత్రి రోజా సెల్వమణికి వింత అనుభవం ఎదురైంది. అది కూడా తన స్వంత నియోజకవర్గంలో ఆ అనుభవం ఎదురుకావడంతో ఆమె అవాక్కయ్యారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఏపీలో గడపగడపకు YCP కార్యక్రమంలో భాగంగా మంత్రి రోజా చిత్తూరు – నగరిలో పర్యటించారు. ఈక్రమంలో ఆమె ఓ వృద్ధుడితో…
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ఎప్పుడూ పొలిటికల్ హీట్‌తో.. గ్రూపు రాజకీయాలతో రచ్చరచ్చగా ఉంటుంది. నిత్యం ఏదో ఒక రగడ ఇక్కడ కామన్. ఇలాంటి క్రమంలో రాజకీయాల్లో ఒకరు ఒక అడుగు ముందుకు వేస్తే.. మనం పది అడుగు వేయలనే ఆలోచనలో టీడీపీ ఇంఛార్జ్ గాలి భాను ప్రకాష్ వ్యూహం మార్చారట. మొన్నటిదాకా సైలెంట్‌గా చక్రం తిప్పిన ఆయన.. రోజాకు మంత్రి పదవి వచ్చాక ప్లాన్ బీ అమలులోకి తెచ్చారట. జిల్లా టీడీపీ నేతలంతా సైలెంట్ మోడ్‌లో…
రాష్ట్రంలో మంత్రి పదవి ఆశించిన నేతలకు వైసీపీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది. జిల్లా అధ్యక్షులు మీరే.. పార్టీ బాధ్యతలు మీవే.. నడిపించేది.. గెలిపించేది మీరే అనే క్లారిటీ ఇచ్చారు. మంత్రులకంటే మీరే ఎక్కువ అని కూడా సాక్షాత్తూ సీఎం చెప్పారు కూడా. అయితే ఇది పదవి అనుకోవాలా.. లేక కొత్త సమస్యలు తలకెత్తుకోవాలో అర్థంకాని పరిస్థితుల్లో పడ్డారు పార్టీ పదవుల్లోకి వచ్చిన నేతలు. కొందరు నాయకులు మాత్రం తమ ముందున్న సవాళ్లను లెక్క చేయకుండా ఉత్సాహంగా…
కొన్ని రోజుల నుంచి ఏపీలో పొత్తు రాజకీయాలు నడుస్తున్నాయి. తన పర్యటనలో భాగంగా ‘అందరూ కలిసి ముందుకు రావాలి’ అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి.. ఈ పొత్తు వ్యవహారం అగ్గి రాజేసుకుంది. దీంతో.. ఏపీ నేతల నోట పొత్తు మాటలే వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ ఈ అంశం మీదే ప్రధానంగా మాట్లాడుతున్నారు. ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. తమ సీఎం జగన్‌ని ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము లేకపోవడం వల్లే, చంద్రబాబు పొత్తుల్ని…
టీడీపీకి చెందిన కొందరు సీనియర్ నేతలు వైసీపీ ఎమ్మెల్యేలతో లోపాయికారి ఒప్పందంలో ఉన్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ట్విటర్ మాధ్యమంగా కౌంటర్ ఇచ్చారు. కేవలం నెల్లూరులోనే ముగ్గురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ తమతో టచ్‌లో ఉన్నారని.. అందులో రోజూ నీతో మాట్లాడే ఒక ఎమ్మెల్యే కూడా ఉన్నారని అన్నారు. ప్రతిరోజూ నిన్ను, నీ పార్టీని బహిరంగంగా బూతులు తిట్టే ఇంకో ఎమ్మెల్యే కూడా ఉన్నారని.. దమ్ముంటే…
మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజాగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. లోకేష్ మరోసారి పప్పు అని నిరూపించుకున్నారని విమర్శించారు. కిన్నెర ప్రసాద్‌కు తాను బినామీనని లోకేష్ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, అసలు బినామీ నువ్వేనంటూ ధ్వజమెత్తారు. అక్రమ లే-ఔట్లలోని ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయొద్దని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసిన విషయం తెలియదా? అంటూ నిలదీశారు. టీడీపీలో ఉన్నప్పుడు కిన్నెర ప్రసాద్ నాలుగు లే-ఔట్లు వేశారని గుర్తు చేసిన…