కృష్ణాజిల్లా రాజకీయాలు హాట్ హాట్ గా వుంటాయి. అందునా అధికార పార్టీ వైసీపీలో అయితే ఎంపీ, మాజీ మంత్రి మధ్య ఏర్పడిన పంచాయతీ ఎట్టకేలకు అధిష్టానం దృష్టికి చేరింది. ఒకవైపు ఎంపీ బాలశౌరిని అడ్డుకుంది పేర్ని నాని వర్గం. మరోవైపు మాజీ మంత్రి పేర్ని నాని ఆగడాలను మీడియాకు ప్రెస్ నోట్ రూపంలో విడుదల చేసింది బాలశౌరి వర్గం. దీంతో రాజకీయం హాట్ హాట్ గా మారింది.
రచ్చ రోడ్డెక్కటంతో రంగంలోకి దిగింది వైసీపీ అధిష్టానం. మీడియా ముందు మాట్లాడవద్దని బాలశౌరికి సూచించారు పార్టీ పెద్దలు. మచిలీపట్నం వచ్చి సీఎం పై విమర్శలు గుప్పించిన బీజేపీ, టీడీపీ నేతలతో పేర్ని నాని వేదిక ఎలా పంచుకుంటారని ప్రశ్నిస్తున్నారు ఎంపీ బాలశౌరి వర్గం నేతలు. మరో నియోజకవర్గంలో కార్యక్రమానికి సుజనా చౌదరి ఆహ్వానించినా హాజరుకాని స్థానిక వైసీపీ ఎమ్మెల్యే వారి దగ్గరకు ఎలా వెళ్ళారని అంటున్నారు.
వివాదం పై నోరు విప్పడం లేదు పేర్ని నాని వర్గం. నాని ఆరోగ్యం బాగోలేదంటున్నారు ఎమ్మెల్యే వర్గం నేతలు. త్వరలోనే మీడియా సమావేశం నిర్వహిస్తామంటున్నారు పేర్ని నాని వర్గం నేతలు. ఎంపీ చెబుతున్నవి అన్నీ అబద్ధాలని కొట్టిపారేస్తోంది మాజీ మంత్రి పేర్ని నాని వర్గం.స్వంత పార్టీ ఎంపీని ఎలా అడ్డుకుంటారని బాలశౌరి వర్గం మండిపడుతోంది. మొత్తం మీద బందర్ మే దంగల్ ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ అవుతోంది.
YSRCP: వైసీపీలో ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే.. రచ్చకెక్కిన విభేదాలు