ఏపీలో జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల పాలనలో నవరత్నాలు నకిలీ రత్నాలుగా, రంగు రాళ్లుగా , గులక రాళ్ళుగా, గుండ్రాళ్ళుగా మారాయన్నారు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి. పేదలందరికీ ఇళ్లు నవరత్నాలలో ఒక అంశం. 2004 నుండి 2014 వరకు కాంగ్రెస్ పాలనలో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 60 లక్షల ఇళ్లు నిర్మించి పేదలకు అందచేశామన్నారు. కానీ జగన్ మూడేళ్ల పాలనలో మంజూరైన ఇళ్లు 15.60 లక్షలు కాగా, పూర్తి అయినవి కేవలం 60,783 మాత్రమే అన్నారు.
మద్యపాన నిషేధం నవరత్నాలలో ఒకటి. కానీ మద్యం ద్వారా రాబోయే 12 సంవత్సరాలకు వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టి ఆర్థిక సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వం 9.62 శాతం వడ్డీతో రూ.8300 కోట్లు అప్పు తీసుకుంది. దీని బట్టి సమీప భవిష్యత్తులో మద్యపాన నిషేదం ఉండదని అభిప్రాయపడ్డారు తులసిరెడ్డి. ఇది మాట తప్పడమే అవుతుంది. మహిళలను నమ్మించి మోసగించడం అన్యాయం.
ఆరోగ్యశ్రీ నవరత్నాలలో ఒకటి. 2007లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సకాలంలో నెట్వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించని కారణంగా జగన్ పాలనలో ఆరోగ్య శ్రీ అనారోగ్య శ్రీ గా మారిందని దుయ్యబట్టారు. ఆరోగ్య శ్రీ డబ్బులు రోగుల ఖాతాల్లో వేయాలని ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశం మరిన్ని చిక్కులు తెస్తుందన్నారు. రోగులు ముందుగా బిల్లులు చెల్లిస్తే తప్ప ఆసుపత్రులు అడ్మిట్ చేసుకోవు. దీని వలన సకాలంలో వైద్యం అందక రోగులు చనిపోతారు. పేద రోగుల పట్ల ముఖ్యమంత్రి కర్కశంగా మారడం శోచనీయం అన్నారు తులసిరెడ్డి.
Breaking : ఈ నెలాఖరులోపు 10వ తరగతి ఫలితాలు