Adimulapu Suresh: ఏపీ వ్యాప్తంగా వికేంద్రీకరణ ఉద్యమం ఉధృతం చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Adimulapu Suresh: రాజధాని వికేంద్రీకరణపై మంత్రి ఆదిమూలపు సురేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని కోసం అంటూ పాదయాత్ర చేస్తున్న వాళ్లు రైతుల్లా కనిపించటం లేదని ఆరోపించారు. ఓ అజెండా ప్రకారం చంద్రబాబు చెప్పినట్లుగా వారు చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలు ఓ దురుద్దేశంతో చేయిస్తున్న పాదయాత్రలా కనిపిస్తోందని.. కొంతమంది పెట్టుబడిదారులు వెనుక ఉండి నడిపిస్తున్నారని విమర్శలు చేశారు. వికేంద్రీకరణ అనేది ప్రజల ఆకాంక్ష అని.. రాష్ట్ర వ్యాప్తంగా వికేంద్రీకరణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యాఖ్యానించారు. వికేంద్రీకరణ సీరియస్‌నెస్ చెప్పడానికే ఓ ఎమ్మెల్యే రాజీనామా చేసి ఉండవచ్చన్నారు. వికేంద్రీకరణపై ప్రభుత్వం దేనికైనా సిద్ధంగా ఉందన్నారు.
Read Also: Karanam Dharmasri: నా రాజీనామా ఆమోదం పొందితే.. టీచర్ పోస్టులో చేరిపోతా
Also Read
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
- Dangerous School Journey: వాగు దాటితేనే బడి.. చిన్నారుల సాహస ప్రయాణం చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే
ఓ ప్రాంతానికి సంబంధించిన సెంటిమెంట్ కోసం పెట్టిన పార్టీ టీఆర్ఎస్ అని.. ఇప్పుడు వాళ్లు దేశం మొత్తం పోటీ చేస్తామంటే వారిష్టం అని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. రాజధాని విషయంలో టీడీపీ నేతలు రైతులను రెచ్చగొట్టి నానా యాగీ చేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని రైతులకు గత ప్రభుత్వం కన్నా తాము ఎక్కువ కౌలు ఇస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం చేసిన తప్పేంటో రైతులు చెప్పాలన్నారు. గత ప్రభుత్వం అడ్డగోలుగా చేసిన ల్యాండ్ పూలింగ్ వల్లే ఇబ్బందులు వచ్చాయన్నారు. అమరావతిని కూడా అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశామని.. సీఎం జగన్ తీసుకువచ్చిన వికేంద్రీకరణ పరిపాలనను రాష్ట్ర ప్రజలు ఆమోదించారన్నారు. ఏపీలో మౌళిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. నిరుపేదలకు ఇళ్లు కట్టి ఇచ్చేందుకు 2023 ఫిబ్రవరి టార్గెట్‌గా పెట్టుకుని కృషి చేస్తున్నామన్నారు. గత ప్రభుత్వం తరహాలో గ్రాఫిక్స్‌లో కాకుండా తాము విజన్‌తో అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!