Kodali Nani: కేసీఆర్ ‘బీఆర్ఎస్’ పార్టీపై కొడాలి నాని కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kodali Nani: తెలంగాణ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీపై మాజీ మంత్రి కొడాలి నాని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బీఆర్ఎస్ మనుగడకు కాలమే సమాధానం చెప్పాలని కొడాలి నాని అభిప్రాయపడ్డారు. అయితే రాజకీయాల్లో ఏదైనా సాధ్యమేనన్నారు. ఇప్పటికే రెండు సార్లు సీఎం అయిన కేసీఆర్ ప్రధాని కావాలని ఆరాటపడుతున్నారేమోనని కొడాలి నాని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏపీ ప్రజలు కేసీఆర్‌ను వ్యతిరేకించారని.. అయితే ఆ తర్వాతి కాలంలో హైదరాబాద్‌లో సెటిలైన ఆంధ్రా వాళ్లు టీఆర్ఎస్ పార్టీని అభిమానించారని కొడాలి నాని గుర్తుచేశారు. ఇప్పటికీ ఏపీలో కేసీఆర్‌పై వ్యతిరేక భావన ఉందని.. అది ఎంత మాత్రం ఉంది.. ఆయన పార్టీకి ఏపీలో క్యాండిడేట్లు దొరుకుతారా అన్న విషయాలపై కాలమే సమాధానం చెప్పాలని కొడాలి నాని అన్నారు. ఎవరైనా, ఎక్కడైనా పార్టీలు పెట్టుకోవచ్చు.. పోటీ చేసుకోవచ్చు అని తెలిపారు. చంద్రబాబు తెలంగాణలో పోటీ చేసి జాతీయ పార్టీ అని చెప్పుకుంటున్నప్పుడు.. కేసీఆర్ ఏపీలో ఎందుకు పోటీ చేయకూడదని ప్రశ్నించారు.
Read Also: Botsa Satyanarayana: ఈనెల 15న విశాఖ గర్జనను విజయవంతం చేయాలి
Also Read
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
- JC Prabhakar Reddy: తాడిపత్రిలో జేసీ వర్సెస్ కేతిరెడ్డి.. మున్సిపల్ ఎన్నికలపై హాట్ కామెంట్స్
- Dussehra Holidays 2026: ఏపీ, తెలంగాణ విద్యార్థులకు గుడ్ న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు.. పూర్తి షెడ్యూల్ ఇదే!
అటు అమరావతి ఉద్యమంపైనా కొడాలి నాని స్పందించారు. అమాయకులైన అమరావతి రైతుల ముసుగులో కమ్మ కుల ఉగ్రవాదులు పాదయాత్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఓడిపోయిన 10 మంది కమ్మ టీడీపీ నేతలు తనను కుల బహిష్కరణ చేయడానికి గుడివాడలో తొడలు కొట్టారంటూ కొడాలి నాని చురకలు అంటించారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పైనా కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌కు ఆయన సోదరుడు చిరంజీవి మద్దతు అవసరం రాకపోవచ్చని.. కానీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న చంద్రబాబు మద్దతు ఉంటే చాలని ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు చెప్తున్న మాటలన్నీ ట్రాష్ అని కొడాలి నాని కొట్టిపడేశారు. 200 ఏళ్లు అయినా అమరావతి నిర్మాణం పూర్తి కాదని కొడాలి నాని అభిప్రాయపడ్డారు. వికేంద్రీకరణతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు