Pawan Kalyan: బూతులు తిట్టే వైసీపీ నేతలకు వార్నింగ్.. తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతా..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: అమరావతిలోని జనసేన కార్యాలయంలో జరిగిన సమావేశంలో వైసీపీ నేతలపై పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. తనను ప్యాకేజీ స్టార్ అంటున్న వైసీపీ నేతల కామెంట్లపై మండిపడ్డారు. తనపై మరోసారి తప్పుడు ఆరోపణలు చేస్తే చెప్పుతో కొడతానని హెచ్చరించారు. జనసేన పార్టీకి సంబంధించిన ప్రతి లెక్కను తాను చెప్తానని తెలిపారు. గత 8 ఏళ్లలో తాను ఆరు సినిమాలు చేశానని.. రూ.100 కోట్ల నుంచి రూ.120 కోట్ల వరకు సంపాదించానని.. . రూ.33.37 కోట్ల ఇంకమ్‌ట్యాక్స్ కట్టానని పవన్ వివరించారు. తన పిల్లల కోసం కట్టిన ఫిక్స్‌డ్ డిపాజిట్లు తీసి మరీ పార్టీకి ఖర్చు చేశానని పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లోని సీఎం రిలీఫ్ ఫండ్, అయోధ్య రామ మందిర నిర్మాణానికి లక్షలాది రూపాయలు ఇచ్చినట్లు గుర్తుచేశారు. జనసేన ఐదు ఖాతాల్లో రూ. 15.58 లక్షలు కార్పస్ ఫండ్ ఉందన్నారు. రైతు భరోసా కోసం రూ. 3.50 కోట్ల నిధులు జనసేన వద్ద ఉన్నాయని తెలిపారు. నా సేన-నావంతు విరాళాల రూపంలో రూ. 4 కోట్లకు పైగా ఉన్నాయన్నారు.
వైసీపీ నేతలకు పాపం బూతులు తిట్టడమే రాదని.. నోట్లో వేలు పెట్టినా వైసీపీ నేతలు కొరకలేరని పవన్ ఎద్దేవా చేశారు. తాను స్కార్పియోలు కొనుకున్నా కొంతమంది సన్నాసులు విమర్శలు చేస్తున్నారని.. ఎవరో తనకు కొనిచ్చారని అంటున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట్లాడితే తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నాని అంటున్నారని.. కావాలనుకుంటే వైసీపీ నేతలు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చన్నారు. తాను విడాకులు ఇచ్చి భరణం కూడా ఇచ్చి వేరే పెళ్లిళ్లు చేసుకున్నానని.. ఒక్క పెళ్లి చేసుకుని 30 మంది స్టెపినీలతో తిరిగే వాళ్లు తనకు చెప్పేందటని ప్రశ్నించారు.
Also Read
- Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
- AP Mayor Reservations: ఏపీ మేయర్ రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
వైసీపీలో అందరూ నీచులే ఉండరని.. బాలినేని, ఆనం రాంనారాయణరెడ్డి లాంటి పెద్దలు కూడా ఉన్నారని పవన్ అన్నారు. అయితే వైసీపీలో నీచుల సమూహం ఎక్కువ అని విమర్శించారు. జనసేన దగ్గర పోరాట పటిమ ఉందని.. కానీ ఎలక్షనీరింగ్ చేయాల్సిన సత్తాను పెంచుకోవాలని సూచించారు. పోలింగ్ బూత్ దగ్గర నిలబడడం అంటే యుద్దం చేసినట్లేనని అన్నారు. అధికారం కొన్ని కులాలకే పరిమితమైందని.. బడుగులకు అధికారం రావాలని.. దాని కోసమే జనసేన పని చేయాలని పిలుపునిచ్చారు. బడుగులకు అధికారం రావాలంటే రెడ్లను తరిమేద్దాం.. కమ్మలను కొట్టేద్దాం అని కాదన్నారు. వేరే వాళ్లని కొట్టి మనం ఎదగాలన్నారు. బడుగులు ఎదగడానికి తన జీవితాన్ని పణంగా పెడతానని పవన్ స్పష్టం చేశారు. బలిజ-కాపు-ఒంటరి-తెలగ సామాజిక వర్గాలకు బలం ఉంది కానీ అధికారం లేదని బాధ ఉందన్నారు. కానీ అధికారాన్ని దక్కించుకునేందుకు ఏం చేశారని నిలదీశారు. మేమూ మేమూ డ్యాష్ డ్యాష్ అంటూ వైసీపీలోని ఓ నేత ఏదేదో మాట్లాడతున్నారని.. నాలిక చీరేస్తానని వార్నింగ్ ఇచ్చారు. బంతి.. చామంతి పూబంతి అనే వాడు ఇంకేదో మాట్లాడుతున్నాడని.. పిచ్చి పిచ్చి వాగుడు వాగొద్దని హితవు పలికారు. వైసీపీలోని కాపు నేతలు జగన్‌కు ఊడిగం చేసుకోండని.. కానీ కులాన్ని లోకువ చేయవద్దన్నారు. ఆనాడు కాంగ్రెస్ నేతలను పంచెలుడదీసి కొట్టండి అన్న పదానికి తరువాత బాధపడ్డానని.. కానీ అప్పటి పరిస్థితుల్లో అలా అనాల్సి వచ్చిందని పవన్ వివరణ ఇచ్చారు.
తాజావార్తలు
-
Nobel Prize Economics : అర్థశాస్త్ర నోబెల్‌పై ఆసక్తి.. విజేతలుగా ఇద్దరు ప్రముఖులు..
-
Srisailam Reservoir: వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో శ్రీశైలం జలాశయం.. దేశంలోనే తొలి ప్రాజెక్టుగా గుర్తింపు
-
El Nino: ఎల్‌నినో ఎఫెక్ట్.. రంగంలోకి సీఎస్.. రైతులతో నేరుగా వీడియో కాన్ఫరెన్స్
-
Pollution: దగ్గు, జలుబు తగ్గడంలేదా? కారణాలు ఇవే కావచ్చు!
-
El Nino: ఎల్‌నినోతో భూమికి భారీ ముప్పు.. బద్దలుకానున్న రికార్డులు!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!