CM Jagan: రైతు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుంది..!!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Jagan: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ ఏడాది వైఎస్ఆర్ రైతు భరోసా రెండో విడత నగదు జమ కార్యక్రమాన్ని ప్రారంభించారు. బటన్ నొక్కి రైతుల ఖాతాల్లో రూ.2,096.04 కోట్లను జమ చేశారు. అనంతరం సీఎం జగన్ ప్రసంగిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలు అని ఎద్దేవా చేశారు. రుణమాఫీ చేస్తానని చెప్పి రైతులను చంద్రబాబు మోసం చేశారని ఆరోపించారు. అప్పటి పాలనకు, ఇప్పటి పాలనకు ప్రజలు తేడా గమనించాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. ఈ ఏడాది కూడా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కురిసిందని చెప్పారు.
చంద్రబాబు హయంలో 2014లో 238 మండలాలు, 2015లో 359 కరవు మండలాలు, 2016లో 301 కరవు మండలాలు, 2017లో 121 కరవు మండలాలు, 2018 ఖరీఫ్‌లో 347, రబీలో 257 కరవు మండలాలు ఉన్నాయని సీఎం జగన్ ఎద్దేవా చేశారు. దేవుడి దయతో గత మూడేళ్లలో ఒక్క మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించాల్సిన అవసరం రాలేదన్నారు. రాష్ట్రంలో 13.29 లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి జరుగుతోందని వివరించారు. రాష్ట్రంలో అనంత, సత్యసాయి జిల్లాతో సహా అన్ని జిల్లాల్లో భూగర్భ జలాలు పెరిగాయని, కరువన్నదే లేదని జగన్ తెలిపారు.
Also Read
- AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
- APPSC Group 1 మూల్యాంకనంపై హైకోర్టులో తుది విచారణ.. కీలక వాదనలు..
- CM Chandrababu: పేదల సొంతింటి కలకు భరోసా.. విజయవాడలో నేడు 26,401 మందికి ఇళ్ల పట్టాలు
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
Read Also: ప్రపంచంలో ప్రమాదకరమైన కుక్కల జాతులు
రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. ప్రతి అంశంలో తమ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందన్నారు. రాష్ట్రంలో 68 శాతం మంది రైతులకు 1.25 ఎకరాల లోపు భూమి ఉందన్నారు. 82 శాతం మంది రైతులకు 2.5 ఎకరాల లోపు భూమి ఉందని.. రైతన్నల ఖాతాల్లో నేరుగా డబ్బులు జమ చేసి అండగా ఉంటున్నామని సీఎం జగన్ తెలిపారు. మూడు విడతల్లో ప్రతి ఏడాది రైతుకు రూ.13,500 సాయం అందిస్తున్నామన్నారు. ఎక్కడా లంచాలు, వివక్షకు తావు లేకుండా వైఎస్ఆర్ రైతు భరోసా, పీఎం కిసాన్ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు పేర్కొన్నారు. పట్టాలు ఉన్న రైతులకే కాకుండా కౌలు రైతులకు, దేవాదాయ భూములు సాగుచేసుకుంటున్న రైతులకు సాయం అందించామన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు చేసే పనులను ప్రజలు గమనించాలని జగన్ కోరారు.
తాజావార్తలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
AI Videos Political War: టీడీపీ వర్సెస్ వైసీపీ.. ఏఐ పొలిటికల్ ఫైట్..
-
Ragi Sweet Pongal: రొటీన్ స్వీట్లకు గుడ్ బై.. నోటికి రుచి, ఒంటికి బలాన్నిచ్చే రాగి తీపి పొంగలి చేసేయండిలా!
-
Temba Bavuma: ఏంటి బవుమా అంత కోపం.. కొట్టేస్తావా ఏంటి.? వైరల్ వీడియో..
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?