ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు పలువురు చేరారు. చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకుని వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు.
పార్టీ అనుబంధ విభాగాల పదవుల భర్తీపై వైసీపీ ఫోకస్ చేసింది. ఇప్పటికే పార్టీ యువ, మహిళా విభాగం కార్యవర్గాన్ని పార్టీ ప్రకటించింది. ఇవాళ మరో ఆరు విభాగాల కార్యవర్గాల ప్రకటన చేసింది వైసీపీ. పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా జంగా కృష్ణ మూర్తి నియామకమయ్యారు.
కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను టీడీపీ బృందం కలిసింది. ఏపీలో ఓట్లపై వారు ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఏపీలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే అధికారంలో ఉన్నవాళ్లే ఫిర్యాదులు చేస్తున్నారని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కరువు, తుఫానులను ఎలా ఎదుర్కొనాలో తనను చూసి నేర్చుకోవాలని చంద్రబాబు అన్నారని.. చంద్రబాబు వ్యాఖ్యలను చూస్తే ఆయనకు పిచ్చి పట్టిందని అర్థమవుతుందని మంత్రి విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుకు నేనే డిజైన్ చేశాను అన్నట్టుగా చెప్పారని.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న 9 సంవత్సరాల కాలంలో పోలవరం గురించి పట్టించుకోలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
యువత, మహిళా బలం వల్లే వైసీపీ లాంటి గూండా నేతలను ఎదుర్కొని జనసేన నిలబడగలుగుతోందని.. వైసీపీ పాలనలో ఏపీ కుక్కలు చింపిన విస్తరిలా మారిందని ఆ పార్టీ అధినేత పవన్‌కళ్యాణ్ పేర్కొన్నారు. దిక్కే లేకుండా పోయిన ఏపీని గాడిలో పెట్టాలంటే.. ఒక్కసారి జనసేనను నమ్మండి అంటూ పవన్ ప్రజలకు సూచించారు.
పచ్చ కామెర్లు ఉన్న వాడికి ఊరంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్లు ఉంది చంద్రబాబు వ్యవహారం ఉందని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఎందుకు 23 స్థానాలకు పరిమితం అయ్యారని ఆయన వ్యాఖ్యానించారు. దశల వారీగా మద్యం నియంత్రణ చేస్తాం అన్నాం.. బెల్టు షాపులు తీస్తాం అన్నాం తీశామని మంత్రి పేర్కొన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీపై వైసీపీ ఫిర్యాదు చేసింది. ఎంపీ విజయసాయి రెడ్డి నేతృత్వంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని వైసీపీ ఎంపీలు కలిశారు. ఏపీలో టీడీపీ దొంగ ఓటర్లను చేర్పించిందని ఎంపీలు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలోని బ్రహ్మదేవి గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనుల పేరుతో శంకుస్థాపనలకే పరిమితమయ్యారని మంత్రి విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయాలు హీటెక్కుతున్నాయి. నకిలీ, డబుల్ ఎంట్రీ ఓట్ల వ్యవహారం రాజకీయ రచ్చ రాజేస్తోంది. ఓట్లకు సంబంధించి వైసీపీ, టీడీపీ మధ్య ఆరోపణలు, విమర్శలు తారాస్థాయికి చేరుతున్నాయి. కొంతకాలం నుంచి ఓట్ల వ్యవహారానికి సంబంధించి వైసీపీ, టీడీపీ మధ్య వార్ నడుస్తోంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్‌కు అభిమానులు ఎవరు నిలబడరు అని ఆయన అన్నారు. తనకు బ్యానర్లు కట్టడానికి వచ్చిన వాళ్లను కూడా చంద్రబాబుకు బ్యానర్లు కట్టమని పంపిస్తున్నాడని పేర్కొన్నారు.