Janasena Leaders Joins YSRCP: ఏపీలో జనసేన పార్టీకి మరో బిగ్‌షాక్ తగిలింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో జనసేనకు చెందిన పలువురు కీలక నేతలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం వైఎస్ జగన్ సమక్షంలో కృష్ణా జిల్లా పెడన జనసేన నేత యడ్లపల్లి రామ్ సుధీర్ వైసీపీలో చేరారు. రామ్‌సుధీర్‌తో పాటు జనసేన స్ధానిక నాయకులు యడ్లపల్లి లోకేష్, పొలగాని లక్ష్మీనారాయణ, మద్దాల పవన్, తోట జగదీష్, ప్రసాద్‌లు వైసీపీలో చేరారు. కండువా వేసి పార్టీలో చేర్చుకున్నారు సీఎం జగన్. ఈ కార్యక్రమంలో మంత్రి జోగి రమేష్ పాల్గొన్నారు.
Read Also: Ap Jobs 2023 : నిరుద్యోగులకు శుభవార్త.. ఆ శాఖలో 70 పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ.. వివరాలివే..
జనసేన విధానాలు నచ్చక ఎడ్లపల్లి రాం సుధీర్ వైసీపీలో చేరారని మంత్రి జోగి రమేష్ తెలిపారు. జగన్ పాలన మెచ్చి కలసి పని చేయాలని పార్టీలో చేరారని.. ఎన్నికల నాటికి చంద్రబాబుతో మిగిలేది పవన్ కళ్యాణ్ ఒక్కరేనన్నారు. జనసేన నేతలు, కార్యకర్తలు ఎవరూ ఆ పార్టీలో ఉండరని.. చంద్రబాబుకు తాబేదారుగా ఉంటూ మోస్తానని పవన్ కళ్యాణ్ చెప్పారన్నారు. ఆత్మాభిమానాన్ని చంపుకుని చంద్రబాబుకు మద్దతు ఇవ్వొద్దని జనసేన నేతలను కోరుతున్నామని మంత్రి జోగి రమేష్ అన్నారు. రాబోయే రోజుల్లో మంచి జరగాలంటే జగన్ నాయకత్వాన్ని బలపరచాలన్నారు. రేపట్నుంచి ఇంకా చాలా మంది జనసేన నుంచి వైసీపీలో చేరబోతున్నారని ఆయన చెప్పారు. అందరికీ వైసీపీ ఆహ్వానం పలుకుతుందన్నారు.
Read Also: Breaking: రాష్ట్రాలకు కేంద్రం కొవిడ్ అలర్ట్.. అప్రమత్తంగా ఉండాలని ఆదేశం
టీడీపీతో జనసేన ముసుగు రాజకీయాలు చేస్తోందని వైసీపీలో చేరిన ఎడ్లపల్లి రాంసుధీర్ చెప్పారు. పవన్ నాయకత్వాన్ని బలపరిచేందుకు మేమంతా పని చేశామని.. పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచారన్నారు. పార్టీలో ఉంటే ఉండండి.. లేదంటే లేదని పవన్ కళ్యాణ్ అంటున్నారని.. పని చేసినందుకు మాపై కోవర్టు ముద్ర వేశారన్నారు. పవన్ కళ్యాణ్‌ను ముసుగు రాజకీయాలు చేయవద్దని కోరుతున్నామని ఆయన అన్నారు. పని చేసే కార్యకర్తలను, నాయకులను పవన్ కళ్యాణ్ కాపాడుకోవాలన్నారు. పార్టీలో ఉంటే ఉండండి, పోతే పోండి అని పవన్ మాట్లాడటం సరికాదన్నారు. జగన్ సంక్షేమ పాలన నచ్చి వైసీపీలో చేరానని ఎడ్లపల్లి రాంసుధీర్ స్పష్టం చేశారు.