CM YS Jagan: ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది. పార్టీలు అభ్యర్థుల ఖరారుపై కసరత్తును వేగవంతం చేశాయి. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ వై నాట్ 175 నినాదంతో అధికారం లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. గెలుపే ప్రామాణికంగా అభ్యర్దులను.. ఇంఛార్జ్‌లను మారుస్తున్నారు. అటు జగన్ ను ఓడించటమే టార్గెట్‌గా టీడీపీ, జనసేన పొత్తుతో బరిలోకి దిగాయి. ఎన్నికల వాతావరణం వేడెక్కెతున్న ఈ తరుణంలో సీఎం జగన్ అభ్యర్థుల ఖరారుపై దృష్టిసారించారు.
Read Also: Purandeswari: కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వం కులాల మధ్య చిచ్చు పెడుతోంది..
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎమ్మెల్యేలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. సీఎంవో నుంచి ఎమ్మెల్యేలకు పిలుపులు అందుతున్నాయి. ఈ క్రమంలో కొంత మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే సీఎంతో సమావేశమయ్యారు. ఇవాళ పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు క్యాంపు కార్యాలయానికి వచ్చారు. ఆయనతో సీఎం చర్చించినట్లు తెలిసింది. మరో నలుగురు ఎమ్మెల్యేలకు కూడా సీఎంవో నుంచి పిలుపు అందింది. పిఠాపురం, జగ్గంపేట, ప్రత్తిపాడు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేలకు పిలుపు అందగా.. అందరితో వేర్వేరుగా సీఎం జగన్ సమావేశం కానున్నట్లు సమాచారం. సీఎం జగన్ చాలా మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను పక్కన పెడతారనే ఊహాగానాలు వస్తున్న తరుణంలో చాలా మంది వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది.