BJP state vice president Vishnuvardhan Reddy comments: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నిర్ణయించిన పార్టీనే అధికారంలోకి వస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండదన్నారు. ఇక్కడ ఆ పార్టీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ఆయన అన్నారు. బీజేపీ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించనుందన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గాని విభజిత ఆంధ్రప్రదేశ్‌లో గాని కేంద్రంలో బీజేపీతో కలిసి ఉన్న పార్టీలే ఆయా రాష్ట్రాల్లో మా సహకారంతో అధికారంలోకి వచ్చాయన్నారు. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలు అభివృద్ధికి క్యాన్సర్ గడ్డ లాంటివని అన్నారు.
Read Also: Police Restrictions: న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు
వారసత్వ పార్టీలు, ప్రాంతీయ పార్టీల నుంచి విముక్తి లభిస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి జాకీలు పెట్టి లేపిన ప్రయోజనం ఏమీ ఉండదన్నారు. బీజేపీ, జనసేన పొత్తు కొనసాగుతూనే ఉందన్నారు. సమైక్య స్ఫూర్తికి రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తూట్లు పొడుస్తోందని ఆయన విమర్శించారు. మూడు నెలల్లో పోయే ప్రభుత్వానికి 30 సంవత్సరాలు ఉద్యోగం చేయాల్సిన ఐఏఎస్‌లు భయపడాల్సిన పనిలేదన్నారు.