ఏపీలో ఎన్నికల సమరం మొదలైంది. పార్టీలు అభ్యర్థుల ఖరారుపై కసరత్తును వేగవంతం చేశాయి. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ వై నాట్ 175 నినాదంతో అధికారం లక్ష్యంగా ముందుకెళ్తున్నారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీ సామాజిక బస్సు యాత్రలో భాగంగా మంత్రి జోగి రమేష్ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. జగన్‌ను ఎదుర్కోవటానికి ఒక టీడీపీ, ఒక చంద్రబాబు సరిపోరట.. అందుకే ఈ పొత్తులు నిర్ణయం అంటూ మంత్రి ఎద్దేవా చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లారు. పవన్‌కళ్యాణ్‌తో చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో మరికొన్ని నెలల్లోనే ఎన్నికలు ఉండటంతో వీరి భేటీ ఆసక్తికరంగా మారింది.
టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ కార్యదర్శి నారా లోకేష్‌లపై తీవ్రంగా మండిపడ్డారు మంత్రి చెల్లుబోయిన వేణు. లోకేష్ పాదయాత్ర లావు తగ్గడానికేననని ఆయన విమర్శించారు. లోకేష్‌ది క్యాట్ వాక్ అని, లోకేష్ పాదయాత్ర వద్దని ఆ పార్టీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడే చెప్పాడన్నారు. పాదయాత్రకే విలువలేదు, లోకేష్ రాసుకున్న ఎర్ర బుక్కు ఏం చేసుకుంటాడంటూ ఎద్దేవా చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌లపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్ అయ్యారు. రాజకీయ నాయకులకు ట్రాన్స్ఫర్స్ ఉంటాయా అని చంద్రబాబు అంటున్నారని.. చంద్రబాబు చంద్రగిరి నుంచి కుప్పంకి, కోడెల శివప్రాసాద్ నరసరావుపేట నుండి సత్తెనపల్లికి ఎలా వచ్చారని ఆయన ప్రశ్నించారు.
ఎన్టీఆర్ భవన్లో తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలతో పాటు పలువురు చేరారు. చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకుని వైసీపీ ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు.
పార్టీ అనుబంధ విభాగాల పదవుల భర్తీపై వైసీపీ ఫోకస్ చేసింది. ఇప్పటికే పార్టీ యువ, మహిళా విభాగం కార్యవర్గాన్ని పార్టీ ప్రకటించింది. ఇవాళ మరో ఆరు విభాగాల కార్యవర్గాల ప్రకటన చేసింది వైసీపీ. పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడిగా జంగా కృష్ణ మూర్తి నియామకమయ్యారు.
కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను టీడీపీ బృందం కలిసింది. ఏపీలో ఓట్లపై వారు ఎన్నికల సంఘాన్ని కలిశారు. ఏపీలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే అధికారంలో ఉన్నవాళ్లే ఫిర్యాదులు చేస్తున్నారని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు.