Ambati Rambabu: చంద్రబాబు మతిస్థిమితం లేకుండా కామెంట్స్ చేస్తున్నారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ అభ్యర్థుల మార్పుపై అనవసరపు కామెంట్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ఎందుకు చంద్రబాబు సింగిల్‌గా పోటీ చేయలేక పోతున్నారని.. చంద్రబాబు, లోకేష్‌లు సింగిల్‌గా పోటీ చేయగలరా అని సవాల్ విసిరారు. చంద్రబాబు, పవన్ పార్టీలను కాలగర్భంలో కలిపేయాలనేదే మా వ్యూహమని మంత్రి చెప్పారు.
Read Also: Jabardasth Satya : పాత్ర నచ్చక పవన్ కల్యాణ్ గారి సినిమానే వదులుకున్నాను.
చంద్రబాబు రాజకీయ అరంగేట్రం కాంగ్రెస్ పార్టీలో… అప్పుడు చంద్రగిరిలో ఓడిపోయాడు.. కుప్పంలో ఇప్పుడు ఓడిపోతాడని పోటీ చేయడేమో అని ఆయన అన్నారు. రిమాండ్ తరువాత చంద్రబాబు మతి భ్రమించిందా అంటూ ఎద్దేవా చేశారు. చంద్రగిరిలో నీకు ఎన్టీఆర్… మంగళగిరిలో లోకేష్ కు జగన్.. దెబ్బ కొట్టారని ఆయన అన్నారు. 2024 ఎన్నికల తరువాత టీడీపీ భూస్థాపితం అవుతుందన్నారు. జగన్‌కు ఒక్కసారి అవకాశం ఇస్తే 30 లక్షల మందికి ఇళ్ళిచ్చారని.. మూడుసార్లు మీరు ఏం చేశారని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మా అంతర్గత మార్పుల మీద మీ మాటలు బాధాకరమన్నారు. యువగళం.. నడిచిన లోకేష్ ఏమైనా ఎదిగాడా.. బరుగు తగ్గాడనుకుంటా అంటూ ఎద్దేవా చేశారు.
Read Also: Kurnool: వివాహేతర సంబంధం.. ప్రేయసిని చంపి ప్రియుడు ఆత్మహత్య!
యువగళం అట్టర్ ఫ్లాప్.. లోకేష్ అంగుళం కూడా ఎదగలేదన్నారు. రెడ్ బుక్‌తో ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు. పవన్‌కి చంద్రబాబు ఎన్ని సీట్లు ముష్ఠి వేస్తారని ప్రశ్నించిన మంత్రి అంబటి రాంబాబు.. మీది కలహాల కాపురం అని ఎప్పుడో తెలిసిందన్నారు. పులివెందుల జగన్ సొంత నియోజకవర్గం.. అక్కడే గెలుస్తారన్నారు. పదేళ్ళ పొత్తు ఏమిటో… కాంట్రాక్టు ప్యాకేజీ పదేళ్ళకు మాట్లాడుకున్నారేమో అంటూ ఆయన విమర్శించారు.