సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరగబోతోంది.. ఒక రకంగా ఇదే చివరి కేబినెట్.. ఈ సమావేశం తర్వాత ముగ్గురు, నలుగురు మినహా మిగతావారంతా రాజీనామా చేస్తారనే ప్రచారం సాగుతోంది. కేబినెట్ భేటీలోనే దీనిపై క్లారిటీ రాబోతోంది. ఈ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి… నేను మళ్లీ మంత్రి కావాలనే ఆశ లేదన్న ఆయన.. ఎల్లకాలం వైఎస్ జగన్ సీఎంగా ఉండాలనేదే నా కోరిక.. డిప్యూటీ సీఎం పదవి…
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు ఢిల్లీలో పర్యటనలో ఏపీ సీఎం జగన్ కేంద్ర రోడ్లు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. సీఎం వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి వున్నారు. రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల ఏర్పాటు పై గడ్కరీతో చర్చించారు. విశాఖలో 6 లేన్ల రహదారిని,విశాఖపట్నం పోర్టు నుంచి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకూ జాతీయ రహదారి అంశంపై చర్చించారు. విజయవాడ…
ఏపీలో మంత్రి వర్గ విస్తరణకు రంగం సిద్ధమయింది. గురువారం కేబినెట్ భేటీ కానుంది. ఇదే చివరి కేబినెట్ భేటీ అంటున్నారు. ఇంతకుముందే మంత్రి పేర్ని నాని కూడా తన మనసులో మాట బయటపెట్టారు. తాను పార్టీ బాధ్యతల్లో వుంటానని, మంత్రిగా తన అధ్యాయం ముగిసిందన్నారు. ఇదిలా వుంటే ఉత్తరాంధ్రకు చెందిన డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మంత్రివర్గ విస్తరణపై చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. రెండురోజుల క్రితం ఆయన మాజీ సీఎం చంద్రబాబుని పొగిడేశారు. చంద్రబాబు విజ్ఞత…
ఉత్తరాంధ్ర విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ శాఖ జలం కోసం-ఉత్తరాంధ్ర జన పోరు యాత్ర సాగిస్తోంది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ మాట్లాడుతూ ప్రభుత్వ తీరుని తప్పుబట్టారు. జలం కోసం – ఉత్తరాంధ్ర జన పోరు యాత్ర ఈనెల 7వ తేదీ 9గంటలకు మొదలవుతుందన్నారు. త్రాగు , సాగునీటి ప్రాజెక్ట్ ల సాధన కోసం మూడు రోజులు యాత్ర సాగిస్తామన్నారు. ఇప్పటికే రెండు రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించామని, ముఖ్య అతిధిగా సునీల్…
రాష్ట్రంలో 13 కొత్త జిల్లాలను ఏర్పాటుచేసి రాష్ట్ర చరిత్రలో ముఖ్యమంత్రి జగన్ కొత్త అధ్యాయానికి నాంది పలికారన్నారు మంత్రి పేర్ని నాని. చంద్రబాబు పెద్ద పెద్ద సొరకాయలు కోస్తారు. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఏమయ్యింది?? కనీసం కుప్పంను రెవెన్యూ డివిజన్ కూడా చేసుకోలేక పోయారు. ఈ అంశాలు పవన్ కళ్యాణ్ కు ఎందుకు కనిపించటం లేదు. జనాభా పెరిగిపోతుంటే పాలనా సౌలభ్యం కోసం ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేక పోయారు?? పవన్ కళ్యాణ్ చంద్రబాబు సలహాతో…
* ఇవాళ ఉదయం 9.05 – 9.45 నిమిషాలకు క్యాంప్ కార్యాలయం నుంచి 26 జిల్లాలను వర్చువల్‌గా లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం వైఎస్ జగన్. *మారనున్న ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం. 26 జిల్లాల రాష్ట్రంగా కొత్త రూపు. 42 ఏళ్ళ తర్వాత రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు. చివరిసారిగా 1979లో ఏర్పడిన విజయనగరం జిల్లా. *నేడు కోనసీమ జిల్లా వ్యాప్తంగా బ్లాక్ డే. అమలాపురం కేంద్రంగా ఏర్పాటైన కోనసీమ జిల్లాకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ పేరును…
1.ఏపీలో ప్రభుత్వాస్పత్రిలో మహిళలు ప్రసవించిన అనంతరం సురక్షితంగా ఇంటికి చేరేందుకు వైఎస్ఆర్ తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను ప్రభుత్వం ప్రారంభించింది. దాదాపు 500 వాహనాలను శుక్రవారం సీఎం జగన్ విజయవాడ బెంజి సర్కిల్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వాస్పత్రుల రూపురేఖలు మారుతున్నాయని వెల్లడించారు. టీడీపీ హయాంలో అరకొరగా ఉన్న తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల స్థానంలో 500 కొత్త వాహనాలను ప్రారంభించామని తెలిపారు. అక్కచెల్లెమ్మలకు తోడుగా ఉండేందుకు అత్యాధునిక…
ఏపీ రాజకీయాల్లో ఒకప్పుడు కీలకమైన ఆ నేత.. ప్రస్తుతం సైలెంట్ అయ్యారు. గత ఎన్నికల్లో ఓటమి అనంతర పరిస్థితులు ఆయన్ను రాజకీయాలకు దూరం చేశాయి. ఆయన భార్య జాతీయస్థాయిలో కీలకంగా ఉండటంతో తనకెందుకు వచ్చిన రాజకీయాలు అని అనుకున్నారు. కానీ.. కుమారుడి కోసం ఆ ఆలోచన మార్చుకున్నట్టు టాక్. ఇంతకీ ఆయన దారేది? ఎవరా నాయకుడు? ఐదుసార్లు ఎమ్మెల్యే.. రెండుసార్లు ఎంపీ..!దగ్గుబాటి వెంకటేశ్వరరావు. మాజీ సీఎం చంద్రబాబు కంటే సీనియర్‌గా తెలుగుదేశం పార్టీలో ఆయన ప్రస్థానం కొనసాగింది.…
టీడీపీ ఆవిర్భావ సభలో సంచలన కామెంట్లు చేసిన లోకేష్ గురించి తెలుగునాట చర్చ సాగుతోంది. గతంలో తనపై వచ్చిన విమర్శలు, తన మాటతీరుపై వచ్చిన వ్యంగ్యాస్త్రాలను దాటుకుని తన స్టయిల్ మార్చేశారు చంద్రబాబు తనయుడు లోకేష్. తాను చంద్రబాబు తరహా కాదని.. మూర్ఖుడినన్నారు లోకేష్.తన మామ బాలయ్య బాబు డైలాగులతో ఆవిర్భావ సభలో ప్రసంగించిన లోకేష్ తీరుని చూసి క్యాడర్ అవాక్కవుతున్నారు. చినబాబు కెవ్వుకేక అంటున్నారు. 2024 నాటికి రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి మీద రూ. 2…