రాజ్యాధికారంలో చరిత్రలో ఎప్పుడూలేని విధంగా ఆయావర్గాలకు పెద్దపీట వేశామన్నారు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. పాత కొత్తమేలు కలయికతో కేబినెట్ రూపొందించారన్నారు సజ్జల. వైయస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన మొదటి కేబినెటే సామాజిక విప్లవానికి నాంది పలికిందన్నారు. ఇప్పుడు పునర్‌వ్యవస్థీకరణ ద్వారా మరో సామాజిక మహావిప్లవం రాబోతోందన్నారు.
చరిత్రలో ఎప్పుడూ కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు అగ్రస్థానం. 2019 జూన్ మొదటి కేబినెట్లో 25 మందికిగానూ 14 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవులు ఇచ్చాం. 11 మంది ఓసీలకు మంత్రిపదవులు ఇచ్చాం. చరిత్రలో ఎప్పుడూ ఇన్ని మంత్రిపదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇవ్వలేదు. 2014లో చంద్రబాబు 25కి 12 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు మాత్రమే మంత్రిపదవులు ఎస్సీలకు ఇచ్చింది 3 మాత్రమే.
చంద్రబాబు తొలి కేబినెట్లో ఎస్టీ, మైనార్టీలకు చోటుదక్కలేదన్నారు. చంద్రబాబు రెండోసారి విస్తరించిన తర్వాత కూడా దిగిపోయేముందు మాత్రమే ఎస్టీకి 4 నెలలముందు ఎస్టీకి చంద్రబాబు ఇచ్చారు. 2019 తొలి కేబినెట్లో 5 మందికి డిప్యూటీసీఎంలు ఇచ్చాం. ఇందులో 4గురు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే
చరిత్రలో ఉప్పుడూ కూడా ఇన్ని ఉపముఖ్యమంత్రి పదవులు ఈ వర్గాలకు ఇవ్వలేదు. దేశ సామాజిక న్యాయచరిత్రలోనే ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు నామినేటెడ్ పదవుల్లో 50శాతం, నామినేటెడ్ వర్కుల్లో 50శాతం ఇచ్చిన తొలి ప్రభుత్వం వైయస్సార్‌సీపీదే అన్నారు. అందులోనూ యాభైశాతం మహిళలకు ఇచ్చిన తొలి ప్రభుత్వం కూడా వైయస్.జగన్ ప్రభుత్వానిదే
ఏఎంసీలు, కార్పొరేషన్ ఛైర్మన్‌లు, గుడి ఛైర్మన్‌లు అన్నీకూడా ఒక చట్టంచేసి మరీ ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలకు 50శాతం ఇచ్చిన ప్రభుత్వం వైయస్.జగన్‌దే. ఎంపీపీలు, జడ్పీ ఛైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు ఇవికూడా చరిత్రాత్మకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చాం. ఇప్పుడు ఆ విప్లవాత్మక నిర్ణయాలను మరింత ముందుకు తీసుకెళ్తున్న వైయస్.జగన్. పునర్‌వ్యవస్థీకరణద్వారా మంత్రిమండలిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు 17 మందికి చోటుకల్పించారు. మొత్తంగా 25 మందిలో ఈవర్గాలకు చెందిన 17 మందికి పదవులు లభించాయి. ఇందులో బీసీల ప్లస్ మైనార్టీలకు 11, ఎస్సీలకు 5, ఎస్టీలకు 1 మంత్రి కట్టబెట్టారన్నారు. అంటే మంత్రిమండలిలో 70 శాతం బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీలకు ఇచ్చిన వైయస్.జగన్. సామాజిక న్యాయంలో మహావిప్లవం ఇది
ఇది చరిత్రలో ఎప్పుడూ జరగలేదన్నారు సజ్జల. 25 మందిలో ఓసీలు 8 మంది, బీసీలు 11 మంది ( ఒక్క మైనార్టీతో కలుపుకుని) ఎస్సీలు – 5, ఎస్టీ –1. 2019 కేబినెట్లో మహిళలకు 3 అయితే ఇప్పుడు 4కి పెంచారన్నారు.
చంద్రబాబు 2017లో మంత్రివర్గ విస్తరణను చూస్తే ఓసీలు 13, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలకు – 12 అంటే చంద్రబాబు హయాంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలకు 12 కాస్తా.. 17కు పెంచాం. అంటే దాదాపు అప్పటికంటే.. 50శాతం పెంచాం. ఇదికాక గత మంత్రివర్గంలో 10 మందిని కొనసాగిస్తున్న వైయస్.జగన్ ఇందులో ఓసీలు, 2, ఎస్సీలు 3, బీసీలు 5గురు వున్నారన్నారు. డిప్యూటీ స్పీకర్ పదవిని వైశ్యులకు ఇవ్వాలని నిర్ణయం. విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇస్తున్నామన్నారు. ప్లానింగ్ బోర్డు డిప్యూటీ ఛైర్మన్ పదవి బ్రాహ్మణుల వర్గానికి చెందిన మల్లాది విష్ణుకు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. శాసనసభలో చీఫ్‌విప్‌గా క్షత్రియ వర్గానికి చెందిన ముదునూరి ప్రసాదరాజుకు ఇవ్వాలని నిర్ణయం జరిగిందన్నారు సజ్జల.