సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు ఏమీ లేదు. జాబితా సాయంత్రం తర్వాత విడుదల అవుతుందన్నారు సజ్జల. సీఎంతో మరో భేటీ ఏమీ లేదు. రాత్రి ఏడు గంటలకు రాజ్ భవన్కు జాబితా పంపిస్తాం అని చెప్పారు. మంత్రుల జాబితా ఫైనల్ లిస్ట్ సిద్ధం అయినట్టుగా తెలుస్తోంది.
దుండగులు కిరాతకానికి పాల్పడ్డారు. కర్నూలు జిల్లాలో ఏపీ హైకోర్టు న్యాయవాది వి.వెంకటేశ్వర్లును దారుణంగా హతమార్చారు. కర్నూలు నగర శివారులోని సఫా ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర వెంకటేశ్వర్లు మృత దేహాన్ని గుర్తించారు పోలీసులు. హత్య చేసి రోడ్డు పక్కన పారేసి ఉంటారని భావిస్తున్నారు పోలీసులు. ఆవుల వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఈ నెల 7 వ తేదీనుంచి ఆయన కనిపించడం లేదు. ఆయన అదృశ్యంపై కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. చింతకుంటలో తమ్ముని వద్దకు వెళ్లి తిరిగివస్తూ…
ఏపీ రాజకీయాలు కాకరేపుతూనే వున్నాయి. ప్రకాశం జిల్లా కొండపి టీడీపీ ఎమ్మెల్యే బాలవీరాంజనేయ స్వామి ఇంటి ముట్టడికి వైసీపీ నేత అశోక్ బాబు ప్రయత్నించడం ఉద్రిక్తతకి దారి తీసింది. ఎమ్మెల్యే స్వామి ఇంటికి కార్యకర్తలతో వెళ్తున్న వైసీపీ నాయకుడు అశోక్ బాబుని పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులను నెట్టుకుంటూ ముందుకు వెళ్లేందుకు అశోక్ బాబు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో 16వ నెంబరు జాతీయ రహదారిపై కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం…
ఏపీ మంత్రివర్గం కూర్పుపై సీఎం జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఏపీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ కసరత్తు ఆదివారం కూడా కొనసాగనుంది. రేపు మరోసారి సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి జగన్, ప్రభుత్వ సలహాదారు సజ్జల. మధ్యాహ్నం 12 గంటలకు వీరిద్దరూ భేటీ కానున్నారు. ఇవాళే తుది జాబితా సిద్ధం చేసే దిశగా కసరత్తు ప్రారంభం అయినా ఇంకా కొలిక్కిరాలేదని తెలుస్తోంది. సీఎం, సజ్జల వరుస భేటీల పై ఆశావహుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.…
నంద్యాల జిల్లాలో జగన్ వసతి దీవెన సందర్భంగా సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు కాకరేపుతున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ వ్యాఖ్యలపై బీజేపీ భాను ప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు, ప్రతిపక్షాలకు, పత్రికలకు ప్రశ్నించే హక్కు ఉంటుంది. వారిని ఉద్దేశించి వెంట్రుక కూడా పీకలేరని సీఎం జగన్ అనడం బాధాకరం అన్నారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి అసభ్యకర పదజాలం వాడటం బాధాకరం. వెంట్రుక పీకడానికి, గుండు కొట్టించుకోవడానికి సీఎం పదవి ఎందుకు? జగన్…
1.టాలీవుడ్ లో విషాదం నెలకొంది. ప్రముఖ సీనియర్ నటుడు బాలయ్య ఈ రోజు ఉదయం కన్నుమూశారు. హైదరాబాద్ యూసఫ్ గూడలోని తన స్వగృహంలో శ్రీ బాలయ్య తుదిశ్వాస విడిచారు. నిజానికి ఈరోజు ఆయన పుట్టినరోజు. ఇలా బాలయ్య పుట్టినరోజు నాడే తిరిగిరాని లోకాలకు వెళ్లడం అందరినీ కలచి వేస్తోంది. గత కొంతకాలంగా వయసు సహకరించక పోవడంతో నటనకు కూడా దూరంగా ఉంటున్న బాలయ్య ఈ రోజు తుదిశ్వాస విడిచారు. https://ntvtelugu.com/veteran-actor-balayya-passes-away-at-94/ 2.దేశంలోని 14 రాష్ట్రాలకు రెవెన్యూలోటు గ్రాంటు…
సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన ఇవాళ కేబినెట్ సమావేశం జరగబోతోంది.. ఒక రకంగా ఇదే చివరి కేబినెట్.. ఈ సమావేశం తర్వాత ముగ్గురు, నలుగురు మినహా మిగతావారంతా రాజీనామా చేస్తారనే ప్రచారం సాగుతోంది. కేబినెట్ భేటీలోనే దీనిపై క్లారిటీ రాబోతోంది. ఈ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి… నేను మళ్లీ మంత్రి కావాలనే ఆశ లేదన్న ఆయన.. ఎల్లకాలం వైఎస్ జగన్ సీఎంగా ఉండాలనేదే నా కోరిక.. డిప్యూటీ సీఎం పదవి…
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. రెండో రోజు ఢిల్లీలో పర్యటనలో ఏపీ సీఎం జగన్ కేంద్ర రోడ్లు జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో భేటీ అయ్యారు. సీఎం వెంట ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి వున్నారు. రాష్ట్రంలో పలు జాతీయ రహదారుల ఏర్పాటు పై గడ్కరీతో చర్చించారు. విశాఖలో 6 లేన్ల రహదారిని,విశాఖపట్నం పోర్టు నుంచి రిషికొండ, భీమిలి మీదుగా భోగాపురం వరకూ జాతీయ రహదారి అంశంపై చర్చించారు. విజయవాడ…