1.ఏపీలో మద్యం బ్రాండ్లపై మండిపడ్డారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. పార్టీ ముఖ్య నేతలతో టీడీపీ అధినేత చంద్రబాబు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కల్తీ సారా అరికట్టాలి.. రాష్ట్రంలో జె బ్రాండ్స్ మద్యం నిషేధించాలి అనే డిమాండ్‌తో రేపు ఎల్లుండి నిరసనలు తెలపాలని పిలుపునిచ్చారు. మద్యం పై ప్రభుత్వాన్ని గ్రామ స్థాయి నేతలు, క్యాడర్ నిలదీయాలి. సీఎం జగన్ ధన దాహంతో మహిళల తాళిబొట్లు తెంచుతున్నాడు. 2.యాదాద్రి నరసింహ స్వామి దర్శనాల కోసం ఎదురుచూస్తున్న భక్తులకు శుభవార్త.. గతంలో…
వైసీపీపై టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. మా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయన్నారు సోమిరెడ్డి. టీడీపీ నేతలు.. కొందరు అధికారుల ఫోన్లను వైసీపీ ట్యాప్ చేస్తుందని మా అనుమానం. ప్రభుత్వ పరంగా కాకుండా.. వైసీపీ పార్టీ పరంగా ఓ సాఫ్ట్ వేర్ ద్వారా ట్యాపింగుకు పాల్పడుతున్నారని మేం నమ్ముతున్నాం. దీనిపై గతంలోనే మా అనుమానాలు వ్యక్తం చేశాం. పెగాసెస్ స్పై వేర్ చంద్రబాబు కొనుగోలు చేశారన్నది ఓ పెద్ద బ్లండర్.…
1.యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. డిగ్రీలో నాలుగేళ్ల కోర్సు, 8 సెమిస్టర్ల విధానానికి యూజీసీ గురువారం నాడు ఆమోదం పలికింది. ఈ నాలుగేళ్లలో ఒక్కో సెమిస్టర్ కాల వ్యవధి 90 రోజులు ఉంటుంది. మొదటి మూడు సెమిస్టర్లలో మ్యాథ్స్, సోషల్, హ్యూమానిటీస్, వృత్తి విద్య వంటి సబ్జెక్టులు ఉంటాయని యూజీసీ తెలిపింది. మూడో సెమిస్టర్ ముగిసిన తర్వాత మేజర్, మైనర్ సబ్జెక్టులను విద్యార్థులు ఎంచుకోవాల్సి ఉంటుంది. 2.ఏపీ సీఎం జగన్ పై నిప్పులు…
ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేష్. మీడియాతో లోకేష్ చిట్ చాట్ చేశారు. నాలుగు రోజులైనా జంగారెడ్డి గూడెం మరణాలపై నాలుగు రోజుల పాటు సాగదీస్తున్నారంటూ ప్రభుత్వం విమర్శలు అర్ధరహితం. ప్రజల ప్రాణాలకంటే మాకు ఏదీ ఎక్కువ కాదు. ప్రజా సమస్యలపై మేం ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాం. సీఎం జగన్ అబద్దాలకు అలవాటు పడ్డారు. నవ్వుతూ అబద్దాలు ఆడడం జగనుకు అలవాటైంది. జంగారెడ్డి గూడెం కల్తీ మరణాలు…
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏ విషయం మీదనైనా చాలా వ్యంగ్యంగా మాట్లాడతారు. తనదైన రీతిలో స్పందిస్తూ వుంటారు. ఆయన రూటే సపరేటు. అంతా వివిధ సమస్య గురించి మాట్లాడితే.. మొన్నామధ్య బిగ్ బాస్ గురించి విమర్శలు చేశారు. తిరుపతిలో నారాయణ ఏపీ రాజకీయాలపై స్పందించారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీల్చును అన్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు స్వాగతిస్తున్నా అన్నారు. బీజేపీ ఎలా వైసీపీకి వ్యతిరేకంగా రోడ్ మ్యాప్ ఇస్తుంది. వైసీపీ, బీజేపీలు లివింగ్ టు గెథర్…
ఆ నియోజకవర్గం టీడీపీలో సీటు కోసం పావులు కదిపేవారు ఎక్కువయ్యారా? నేతల మధ్య పోటీ పెరిగిందా? మాజీ ఎమ్మెల్యే అందుబాటులో ఉండటం లేదని కొత్త నాయకుడు కావాలంటున్నారట కార్యకర్తలు. దీంతో కొత్తవాళ్లు ఎంట్రీ ఇస్తున్నట్టు సమాచారం. ఆ పోటీకాస్తా రసవత్తరంగా మారిపోయింది. సొంత వ్యాపారాలపై మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ ఫోకస్నెల్లూరు జిల్లా వెంకటగిరిలో టీడీపీకి బలం ఉన్నప్పటికీ సరైన నేత లేక తీవ్ర అసంతృప్తిలో ఉంది కేడర్. 2004, 2009లో ఎమ్మెల్యేగా పనిచేసిన కురుగొండ్ల రామకృష్ణ 2019లో…
1.ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న దాడుల్లో ఉక్రెయిన్ సైనికులతో పాటు సాధారణ ప్రజలు కూడా మరణిస్తున్నారు. ఇరు దేశాల యుద్ధం ప్రారంభమై మంగళవారం నాటికి ఆరు రోజులు అవుతోంది. రోజురోజుకు యుద్ధం తీవ్రత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దాడుల్లో భారత్‌కు చెందిన ఓ విద్యార్థి మృతి చెందాడు. రెండో అతిపెద్ద నగరమైన ఖర్కీవ్‌లో రష్యా మిస్సైల్ దాడిలో కర్ణాటకకు చెందిన మెడికల్ విద్యార్థి నవీన్ మరణించాడు. 2.దేశ వ్యాప్తంగా కరోనా ఆంక్షలు…
1.తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా తమ సత్తా చాటుతామని, కేసీఆర్ కు బుద్ధి చెబుతామన్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్.హైదరాబాద్ బీజేపీ జోనల్ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడారు. ఈనెల 6 నుండి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సదస్సులు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. 2.అమరావతి: టీడీపీ స్ట్రాటజీ కమిటీ భేటీలో ఏపీ సీఎం జగన్‌పై చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. వివేకా హత్య కేసులో సూత్రధారి ఎవరో తెలిసిపోయిందని ఆయన…
విజయవాడ 28వ డివిజన్ శ్రీనగర్ కాలనీలో వంగవీటి రంగా కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు వంగవీటి రాధా. దీంతో శ్రీనగర్ కాలనీకి పెద్దఎత్తున చేరుకున్నారు వంగవీటి రంగా, రాధా అభిమానులు. భారీ ర్యాలీతో, బాణా సంచాతో రాధాకు స్వాగతం పలికారు అభిమానులు. కార్యక్రమంలో టీడీపీ, వైసీపీ, జనసేన, బీజేపీ నాయకులు. నా తండ్రిని కులమతాలకతీతంగా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారు. శ్రీనగర్ కాలనీలో కాంస్య విగ్రహం ఏర్పాటు చేసిన వారికి కృతజ్ఞతలు.రాష్ట్రం నలుమూలలా రంగా గారి పేరుతో కార్యక్రమాలు చేస్తున్నారు.…
ఏపీలో అసలేం జరుగుతోంది? గత కొంతకాలంగా కాపు నేతలు భేటీల మీద భేటీలు కావడం వెనుక ఆంతర్యం అదేనా? రాజకీయంగా వత్తిడి పెంచేందుకు ఒక వేదిక అవసరం అని భావిస్తున్నారా? తాజాగా విశాఖలో జరిగిన కాపు నేతల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఫోరమ్ ఫర్ బెటర్ ఏపీ పేరుతో ఒక సంస్థ ఆవిర్భావం జరిగిందని మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు ప్రకటించారు. ఫోరమ్ ఫర్ బెటర్ ఏపీ ఛైర్మన్ గా మాజీ డీజీపీ నండూరి సాంబశివరావు…