బీసీలను ఓటుబ్యాంకుగా భావించే పార్టీలకు భిన్నంగా 2019లో సీఎం జగన్ బీసీలకు ఎక్కువ పదవులు ఇచ్చి కొత్త సంప్రదాయం నెలకొల్పారు. పేదలకు తాయిలాలు ఇవ్వడమే కాకుండా సీఎం జగన్ పాలనలో భాగం ఇచ్చారన్నారు సజ్జల. వైసీపీ మొదటి నుంచి బీసీ, ఎస్సీ, ఎప్టీ, మైనారిటీలకు పెద్ద పీట వేస్తోంది. తొలి కేబినెట్లో 14 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు చోటిచ్చారు. బీసీల్లో ఆత్మస్థయిర్యం పెంచాం. ఈసారి 25మందిలో 70 శాతం మంది బడుగు, బలహీనవర్గాల వారే. చంద్రబాబు పార్టీ దివాలా తీసింది. చిన్న ఒడిదుడుకులను టీడీపీ క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. చంద్రబాబు హయాలంలో 48 శాతమే బడుగు, బలహీనవర్గాల వారు వున్నారు. ఇప్పటివరకూ ముగ్గురు మహిళలకు చోటిస్తే అది ఈసారి నాలుగుకి పెంచారు.