పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజ్ వివాదంలో మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేసిన వ్యవహారం ఏపీలో రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై మరొకరు తారాస్థాయిలో విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఈ క్రమంలోనే నారాయణ ఫోన్‌ను ట్యాప్ చేశామని మంత్రి పెద్దిరెడ్డి వ్యాఖ్యానించడం.. అగ్గికి ఆజ్యం పోసినట్టయ్యింది. దీంతో.. ఫోన్ ట్యాప్ చేయడం నేరపూరిత చర్య అని, అందుకు పాల్పడుతున్న వారిపై క్రిమినల్ కేసు రిజిష్టర్ చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష…
వైసీపీ ప్రభుత్వం చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్ళిన కొందరు అధికార పార్టీ నేతలకు ఊహించని షాక్ తగిలింది. ప్రజల నుంచి నిరసన సెగ ఎదురైంది. వివిధ అంశాలపై ప్రజలు నేతల్ని నిలదీస్తున్నారు. ఉపాధిహామీ పనుల కూలీలు రాలేదని కొందరు, రోడ్డు వేయించమని మరికొందరు నేతలపై తిరుగుబాటుకి దిగారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కొడాలి నాని వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదంటూ మీడియా ముందుకొచ్చారు. జగన్ బతికున్నంత…
జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ‘రైతు భరోసా యాత్ర’ చేపట్టినప్పటి నుంచి.. ఆంధ్ర రాజకీయాలు వ్యవసాయ రంగం చుట్టూ తిరుగుతున్నాయి. అధికార, టీడీపీ పార్టీలు సైతం.. ఈ సందర్భంగా కార్యక్రమాలు, కమిటీల్ని నిర్వహిస్తున్నాయి. తాజాగా టీడీపీ ‘రైతు కోసం తెలుగుదేశం’ పేరిట ఓ కమిటీని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. జగన్ మూడేళ్ళ పాలనలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని విమర్శించారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదని,…
టీడీపీకి గతంలో కంచుకోటగా ఉన్న ఉమ్మడి విజయనగరం జిల్లా.. ప్రస్తుతం మంచుకోటగా మారి.. క్రమంగా పార్టీ ఉనికి కోల్పోతున్న దుస్థితి నెలకొంది. 2019 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలను గంపగుత్తగా వైసీపీ కైవశం చేసుకున్నప్పుడే ఈ విషయం తేటతెల్లమైంది. అప్పటితో పని అయిపోయిందని అనుకున్నారో.. పార్టీకి ఊపిరి లూదడం తమకు సంబంధం లేదని భావించారో ఏమో ప్రస్తుతం నాయకులతోపాటు పార్టీ కూడా పొలిటికల్ తెరపై నుంచి కననుమరుగయ్యే ప్రమాదం దాపురించింది. మరో రెండేళ్లలో అసెంబ్లీ…
ఆంద్రప్రదేశ్‌లో రోజురోజుకి రాజకీయ పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. పొత్తు, ప్రశ్నాపత్రాల వివాదం, ఎన్నికల వ్యూహాలు.. వంటి అంశాలపై అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు ఒకరిపై మరొకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. తాజాగా ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌ను స్టార్ హోటల్‌గా మార్చుకున్నారని వ్యాఖ్యానించిన ఆయన.. చంద్రబాబు హైదరాబాద్ వదిలి ఏపీకి రారని అన్నారు. గత ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఇచ్చిన షాక్ నుంచి చంద్రబాబు…
ఓవైపు మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేసిన వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కలకలం సృష్టిస్తుండగా, మరోవైపు 2014-19 మధ్య భూసేకరణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై చంద్రబాబు A1గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తాజాగా స్పందించారు. అసలు ఇన్నర్ రింగ్ రోడ్డే లేనప్పుడు, ఇంకా అలైన్మెంట్ మార్పు ఎక్కడినుంచి వస్తుంది? అంటూ ప్రశ్నించారు. రోడ్డేసినట్టు, అలాగే దాని వల్ల చంద్రబాబు మనుషులకు ఏదో లబ్ది చేకూరినట్టు వైసీపీ ప్రభుత్వం భ్రమలు…
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ వివాదంలో మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ వ్యవహారంతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. అధికార, విపక్ష నేతల మధ్య తారాస్థాయిలో మాటలయుద్ధం జరుగుతోంది. కక్ష సాధింపు చర్యలో భాగంగానే నారాయణను అరెస్ట్ చేశారని.. తన అసమర్థతని కప్పిపుచ్చుకోవడం కోసం, ప్రజల దృష్టి మరల్చడం కోసమే ఈ అక్రమ అరెస్ట్ వైసీపీ ప్రభుత్వం తెరతీసిందని విపక్ష నేతలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా స్పందించారు. గత మూడేళ్ళ…
పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ వివాదంలో మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ వ్యవహారం ఏపీలో తీవ్ర కలకలం రేపుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యేనని, ప్రభుత్వ అసమర్థతను కప్పిపుచ్చుకోవడం కోసం నారాయణపై అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేశారంటూ విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి స్పందించారు. ఇందులో ఎలాంటి కక్ష సాధింపు లేదని, వాస్తవాల ఆధారంగానే పోలీసులు అరెస్ట్ చేశారని,…
మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌పై ప్రతిపక్షాలు ‘కక్ష సాధింపు చర్యే’నంటూ చేస్తోన్న విమర్శలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. విద్యార్థులకు సహజమైన విద్యనందించి మంచి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన విద్యాసంస్థలు.. రికార్డుల వేటలో అక్రమాలకు పాల్పడ్డాయని అన్నారు. అసలు పేపర్ మాల్ ప్రాక్టీస్ కల్చర్ నారాయణ, శ్రీచైతన్య సంస్థల నుంచే వచ్చాయన్నారు. అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడం వల్లే నారాయణ దొరికిపోయారని చెప్పిన సజ్జల.. రికార్డుల కోసం వాళ్ళు తప్పుడు విధానాలకు పాల్పడ్డారన్నారు. కాపీయింగ్‌ను ఆర్గనైజ్డ్ క్రైమ్‌గా నారాయణ…
కాకినాడ రూరల్‌లో టీడీపీ పరిస్థితి ఉందా లేదా అన్నట్టు తయారైంది. పార్టీని నడిపేవారు లేక కేడర్ పరిస్థితి గందరగోళంగా మారింది. ఇక్కడ నుంచి 2014లో టీడీపీ ఎమ్మెల్యేగా పిల్లి అనంతలక్ష్మి గెలిచారు. 2019లో పిల్లి అనంతలక్ష్మి.. అంతకుముందు 2009లో ఆమె భర్త సత్యనారాయణ కాకినాడ రూరల్‌లో ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత కొద్దిరోజులు బాగానే పనిచేశారు. తర్వాతే పరిణామాలు మారిపోయాయి. అనంతలక్ష్మి కుమారుడు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశారని ఒక మహిళ పోలీసులకు…