ఏపీలో జిల్లాల పునర్విభజన తర్వాత నరసాపురం పార్లమెంట్ పరిధి పశ్చిమగోదావరి జిల్లాగా మారింది. కాకపోతే జిల్లా కేంద్రంగా నరసాపురానికి బదులు భీమవరాన్ని చేశారు. ఇదే నరసాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో ఆరని చిచ్చుగా మారింది. వివిధ పార్టీల నాయకులు.. ప్రజా సంఘాలు JACగా ఏర్పడి నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఉద్యమించాయి. అప్పట్లో ఈ సెగ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజుకు గట్టిగానే తగిలింది. సొంత పార్టీకి చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సైతం…
పెద్దాపురంలో టీడీపీ తరపున వరసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు నిమ్మకాయల చినరాజప్ప. గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం హోదాలో హోంమంత్రిగా పనిచేశారాయ. చినరాజప్ప సొంతూరు అమలాపురంలో ఉంటుంది. అయితే అది ఎస్సీ రిజర్వ్డ్ సెగ్మెంట్ కావడంతో… 2014 ఎన్నికల్లో తొలిసారి పెద్దాపురం బరిలో నిలిచారు. ఇదే స్థానం నుంచి 1994,1999లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు బొడ్డు భాస్కర రామారావు. 2004, 2009 ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో బొడ్డు ఫామిలీ సైకిల్…
కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకుంటాయని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు చేసిన ఈ కామెంట్స్ అనేక సందేహాలకు.. చర్చకు కారణం అవుతున్నాయి. టీడీపీ వన్‌సైడ్ లవ్వు.. జనసేనను కన్నుగీటడం.. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని పవన్ కల్యాణ్ ప్రకటన.. ఇంతలోనే అందరం కలవాలి.. త్యాగాలకు సిద్ధమని చంద్రబాబు స్టేట్మెంట్ రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించాయి. దీంతో బంతి బీజేపీ కోర్టులో పడింది. కాషాయ పార్టీ 2014ను రిపీట్ చేస్తుందా? బద్ధ…
ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా పొత్తు రాజకీయాలపైనే చర్చలు నడుస్తున్నాయి. ప్రధాన పార్టీ నేతలందరూ ఆ అంశంపైనే మాట్లాడుతున్నారు. ఇప్పుడు మంత్రి జోగి రమేష్ ఈ విషయంపై స్పందించారు. సీఎం జగన్ బలంగా ఉన్నారు కాబట్టే, చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారని విమర్శించారు. జగన్‌ని సింగిల్‌గా ఎదుర్కొనే ధైర్యం చంద్రబాబుకు, టీడీపీకి లేదని ఎద్దేవా చేశారు. పవన్ కళ్యాణ్ ఒక్కడుగా రాగలడా? అని ప్రశ్నించిన ఆయన.. ఆయనకు కావాల్సింది కూడా పొత్తులేనన్నారు. బలహీనులైన మనల్ని జగన్ బలవంతుల్ని…
కర్నూలులో రైతు భరోసా యాత్రలో భాగంగా వైసీపీ ప్రభుత్వంపై జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ గుప్పించిన విమర్శలకు గాను, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆయనపై ధ్వజమెత్తారు. దమ్ముంటే కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవాలని పవన్‌కి సవాల్ విసిరారు. కర్నూలు పాతబస్తీలోని తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన హఫీజ్ ఖాన్.. రెండు చోట్ల పోటీ చేసి దారుణ ఓటమిని చవిచూసిన పవన్‌కు ప్రజా సంక్షేమ పాలనపై విమర్శించే అర్హత లేదన్నారు. కేవలం తన ఉనికిని…
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా పొత్తు రాజకీయాలు నడుస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా రెండేళ్ళ సమయం ఉన్నప్పటికీ, ఏయే పార్టీలు ఎవరెవరితో చేతులు కలపనున్నాయన్న అంశంపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రధాన పార్టీ నేతలందరూ దీనిపై స్పందిస్తున్నారు. తాజాగ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఈ విషయంపై స్పందించారు. పొత్తుల విషయంలో తాము స్పష్టంగా ఉన్నామని, జనసేనతో పొత్తు కొనసాగుతోందని ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే.. టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటుందా? లేదా?…
ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం వుంది. పార్టీలు మాత్రం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రెడీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలవాల్సి వుందని, అందుకు టీడీపీ నాయకత్వం వహిస్తుందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా త్యాగాలకు కూడా సిద్ధమేనంటూ చంద్రబాబు పొత్తు రాజకీయానికి తెరతీశారు. ఎన్నికలకు ముందే పొత్తుల కోసం రెడీ అవుతున్నాయి. వైసీపీ నేతలు అంచనా వేస్తున్నట్లుగా టీడీపీ – జనసేన కలిసి పోటీ చేయటం ఖాయమనే సంకేతాలు వున్నాయి. పవన్ కళ్యాణ్ నంద్యాల జిల్లా పర్యటనలో…
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో చాలామంది బెర్త్ కోల్పోతే తానేటి వనితకు మాత్రం కొనసాగింపుతో పాటు ప్రమోషన్ లభించింది. ఓ మెట్టు పైకి ఎక్కారు. కీలకమైన హోంశాఖను దక్కించుకున్నారు. మొదటి కేబినెట్లో స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఇచ్చిన సీఎం.. ఇప్పుడు తన మీద ఇంతటి బాధ్యత పెట్టినందుకు వనిత ఆనందపడ్డారు. కానీ హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండు వారాలు కూడా కాకుండానే వరస సంఘటనలు.. కామెంట్స్‌తో వివాదాలు ఇరుక్కుంటున్నారు. మహిళలపై వరస అఘాయిత్యాలతో పోలీస్ శాఖ గందరగోళంలో పడుతోంది.…
40 ఏళ్ల చరిత్ర కలిగిన టీడీపీ… ఇప్పుడు ట్యూషన్ పెట్టించుకుని రాజకీయ పాఠాలు చెప్పించుకుంటోంది. అదీ ఒక్కరితో కాదు.. ఇద్దరితో. ఇప్పుడంతా పొలిటికల్ స్ట్రాటజిస్టుల ట్రెండ్ నడుస్తోంది. వ్యూహకర్తలు ఉంటే గెలుపు తీరాలకు చేరొచ్చనే భావన జాతీయ, ప్రాంతీయ పార్టీల్లో బలంగా ఉంది. ఆ క్రమంలోనే టీడీపీ సైతం స్ట్రాటజిస్టులకు పార్టీని అప్పజెప్పింది. ముందుగా రాబిన్‌శర్మ టీమ్‌కు బాధ్యతలు అప్పగించారు. తాజాగా మరో స్ట్రాటజిస్ట్ కనుగోలు సునీల్ ఎంట్రీ ఇచ్చారు. ఆయనే తెలంగాణలో కాంగ్రెస్‌కు కూడా వ్యూహకర్తగా…
ఏపీలో విపక్షాలు మూకుమ్మడిగా అధికార వైసీపీపై మండిపడుతున్నాయి. సీపీఐ కార్యదర్శి రామకృష్ణ వైసీపీ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు. ప్రజా ఉద్యమాల అంటే సీఎం జగనుకు అంత ఉలుకెందుకు..? కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధిక ధరలను, పన్నుల భారాన్ని ప్రజలపై గుదిబండగా మోపాయి. ఈ నెల 9న సీపీఐ ఛలో అమరావతికి పిలుపునిస్తే రెండు రోజుల ముందు నుండే రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ముందస్తు అరెస్టులకు సిద్ధపడ్డారు. అధిక ధరలను అరికట్టలేని వైసీపీ ప్రభుత్వం సీపీఐ, ప్రజా సంఘాల…