కాకినాడ జీజీహెచ్ లోనే డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహం వుంది. పోస్ట్ మార్టం ఇంకా పూర్తికాలేదు. ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్టు చేస్తే తప్ప పోస్ట్ మార్టం చేయడానికి అంగీకరిస్తూ సంతకం చేసేది లేదని అంటున్నారు కుటుంబ సభ్యులు. దీంతో జీజీహెచ్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
నిన్న అంతా కాకినాడ జీజీహెచ్ లో హై డ్రామా కొనసాగింది. నిన్న ఉదయం 11 గంటల నుంచి మార్చురీ లోనే ఉంది సుబ్రహ్మణ్యం మృతదేహం. కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఘటన జరిగి దాదాపు 30 గంటలు గడిచిన ఎమ్మెల్సీ అనంతబాబు స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.