విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీపై విద్యుత్ జేఏసీ - యాజమాన్యాల మధ్య ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. విద్యుత్ ఉద్యోగుల రివైజ్డ్ పే స్కేళ్లను యాజమాన్యం ఖరారు చేసింది. సింగిల్ మాస్టర్ స్కేల్‌తో కూడిన పీఆర్సీ ఒప్పందంపై విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సంతకాలు చేసింది. కొత్త పీఆర్సీ ప్రకారం 8 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
2024లో గాజువాకలో జనసేన జెండా ఎగరడం ఖాయమని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఓడిపోయిన ఒక నాయకుడికి గాజువాకలో ఇంత ఆదరణ లభించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. గాజువాకను తాను ఎప్పుడు వదల్లేదని.. తాను ఓడిపోవడం తప్ప తప్పు చేయలేదని పవన్ అన్నారు. జనసేన ఆశయానికి ప్రజలు అండగా ఉంటారనేది ఎప్పటికప్పుడు మీ ఆదరణ నిరూపిస్తోందని ఆయన పేర్కొన్నారు.
నడకమార్గంలో చిరుతల దాడుల నేపథ్యంలో టీడీడీక కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల భధ్రత దృష్టా రేపటి నుంచి ఉదయం 5 గంటల నుంచి మధ్యహ్నం 2 గంటల వరకే చిన్నారులను నడకమార్గంలో అనుమతించనుంది టీటీడీ.
విద్యుత్ ఉద్యోగులతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించాయి. పీఆర్‌సీపై ఉభయుల మధ్య ఎట్టకేలకు అంగీకారం కుదిరింది. ఈ మేరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
విద్యుత్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని బీజేపీ ఏపీ చీఫ్ పురంధేశ్వరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యుత్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించి వారికి న్యాయం చేయాలన్నారు.