Tirupati Crime: ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసుల్లో కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు. తమ ఒంటిపై ఉన్న ఖాకీ బట్టల్ని అడ్డం పెట్టుకొని, తామేం చేసినా చెల్లుతుందని భావిస్తూ అన్యాయాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా.. అమాయకులపై అరాచకాలకు పాల్పడుతున్నారు. ఇందుకు నిదర్శనంగా ఇప్పటికే ఎన్నో ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. తన సొంతూరికి వెళ్లడానికి బస్టాండ్‌లో వేచి ఉన్న మహిళను పోలీసులు అన్యాయంగా కొట్టారు. దీంతో.. ఆ మహిళ రోడ్డుపై నిరసనకు దిగింది.
Boat Ride on Crocodiles: ఈడు మగాడ్రా బుజ్జి.. వందలాది మొసళ్లనే ఉ** పోయించాడుగా! వీడియో వైరల్
ఆ మహిళ తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె పుంగనూరు నియోజకవర్గంలో రోంపిచర్లకు చెందింది. తిరుపతికి వచ్చిన ఆమె తిరుగు పయనమైంది. అర్థరాత్రి తిరుపతి బస్టాండ్‌కు వచ్చింది. అయితే.. ఊరికి వెళ్లేందుకు బస్సు చార్జీలకు సరిపడా డబ్బులు ఆమె వద్ద లేవు. దీంతో.. అక్కడే ఉన్న పోలీసుల్ని కొంత డబ్బు ఇవ్వాలని వేడుకుంది. కానీ.. వాళ్లు ఆమెపై దాడి చేశారు. విచక్షణారహితంగా కొట్టారు. తనని కొట్టొద్దని వేడుకున్నా వాళ్లు విడిచిపెట్టలేదు. వాళ్లు కొట్టిన దెబ్బలకు.. ఆ మహిళ కాళ్లు, చేతులపై తీవ్ర గాయాలయ్యాయి. తన తప్పేమీ లేకపోయినా తనపై దాడి చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ మహిళ.. రోడ్డుపై నిరసనకు దిగింది.
Fire Accident : రాజేంద్రనగర్ లో భారీ అగ్ని ప్రమాదం.. ఎగసిపడుతున్న మంటలు..
బస్సు చార్జీలకు డబ్బులు అడిగిన పాపానికి పోలీసులు తనపై అన్యాయంగా దాడి చేశారని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఏం తప్పు చేశానని తనని కొట్టారంటూ నిలదీసింది. వాళ్లు అకారణంగా తనని కొట్టారని.. చేతులు, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయని.. తన పిల్లలకి ఏం సమాధానం చెప్పాలని రోధించింది. తనని ఎందుకు కొట్టారో ఆ పోలీసులు సమాధానం చెప్పాలని అడిగిన మహిళ.. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కాగా.. ప్రస్తుతం ఆ మహిళకు రుయా ఆసుపత్రిలో చికిత్స అందుతోంది.