A Man Lost Almost 2 Lakhs By Sending 5 Rupees On PhonePe Over Power Bill Issue: సాంకేతికత వినియోగం పెరుగుతున్నకొద్దీ సైబర్ మోసాలు కూడా పెచ్చుమీరిపోతున్నాయి. సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త విధానాల్ని అవలంభిస్తూ.. ప్రజల్ని దోచుకుంటున్నారు. సింపుల్ విధానాలతో అవతలి వ్యక్తులకు తెలియకుండా, లక్షలకి లక్షలు కాజేస్తున్నారు. ఇప్పుడు కరెంట్ బిల్లు పేరుతో ఏకంగా రూ.1.85 లక్షలు ఉడాయించిన ఘటన చోటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే..
Kajal Aggarwal Pics: శారీలో చందమామ.. కాజల్ అగర్వాల్ లేటెస్ట్ పిక్స్ వైరల్!
మార్చి 28వ తేదీన పెదపుల్లేరు గ్రామానికి చెందిన కలిదిండి పెదరామకృష్ణంరాజుకి ఓ గుర్తు తెలియని నంబర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. మీరు కరెంట్ బిల్లు కట్టలేదని, కట్టకపోతే కరెంట్ కట్ చేస్తామంటూ ఆ మెసేజ్‌లో పేర్కొని ఉంది. అయితే.. కృష్ణంరాజు ఆల్రెడీ కరెంటు బిల్లు కట్టేశాడు. అయినా తనకు ఈ మెసేజ్ రావడంతో.. అందులో ఉన్న ఫోన్ నంబర్‌కు ఫోన్ చేశాడు. తాను కరెంట్ బిల్లు కట్టేశానని, అయినా కట్టలేదని తనకు మెసేజ్ వచ్చిందని అవతలి వ్యక్తి చెప్పాడు. అప్పుడు ఆ వ్యక్తి ఒక లింక్ పంపుతామని, దాన్ని క్లిక్ చేస్తే బిల్లు కట్టారో లేదో తెలుస్తుందని చెప్పాడు.
K.Bhagyaraj 3.6.9 Movie: గంటన్నరలోపే సినిమా పూర్తి… విడుదలయ్యేది ఎప్పుడంటే?
ఆ వ్యక్తి చెప్పినట్టుగానే కృష్టంరాజు లింక్ క్లిక్ చేశాడు. ఏదో ఒక వెబ్‌సైట్ ఓపెన్ అయ్యింది కానీ, అందులో కరెంట్ బిల్లు కట్టినట్టు వివరాలు లేవు. దాంతో మరోసారి కృష్టంరాజు ఆ వ్యక్తికి ఫోన్ చేసి, అందులో కరెంట్ బిల్లు వివరాలేమీ లేవన్నాడు. అందుకు అవతలి వ్యక్తి బదులిస్తూ.. ఒక నంబర్ పంపుతున్నామని, దానికి రూ.5 ఫోన్ పే చేస్తే తెలుస్తుందని చెప్పాడు. అతడు చెప్పినట్లు కృష్టంరాజు సదరు ఫోన్ నంబర్‌కి రూ.5 ఫోన్ పే చేశాడు. మళ్లీ తనకు అవతలి వ్యక్తి నుంచి ఫోన్ రాకపోవడం, ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో.. కృష్ణంరాజు ఈ వ్యవహారాన్ని పక్కన పెట్టేశాడు.
Women Health: డెలివరీ తరువాత స్త్రీలు డిప్రెషన్‌కు ఎందుకు గురవుతారో తెలుసా?
కట్ చేస్తే.. ఆగస్టు నెలలో తనకు కొంత డబ్బు అవసరమై, కృష్టంరాజు బ్యాంక్‌కి వెళ్లాడు. తన ఖాతాను పరిశీలించగా.. మార్చి 28వ తేదీన రూ.1.85 లక్షలు మాయమైనట్టు అతనికి తెలిసింది. దీంతో ఖంగుతిన్న కృష్టంరాజు.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టగా.. మార్చి 28వ తేదీన కరెంట్ బిల్లు కట్టలేదన్న వంకతో ఈ డబ్బులను సైబర్ నేరగాళ్లు దోచేసినట్టు గుర్తించారు. ప్రస్తుతం ఆ నేరగాళ్లని గుర్తింపు పనిలో నిమగ్నమయ్యారు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఆన్‌లైన్ లింక్‌లు క్లిక్ చెయొద్దని పోలీసులు సూచించారు.