టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మైనింగ్ శాఖా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ఇసుకాసురుడు అంటు చంద్రబాబు జగన్పై ఆరోపణలు చేశారని, ఇసుక విధానం పై 19 సార్లు చంద్రబాబు జీవోలు తెచ్చారని పేర్కొన్న మంత్రి.. ఇసుకను దోచిన వారే ఆరోపణలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు.
రాష్ట్రంలో దళారీ వ్యవస్థ ఎక్కువగా ఉందని విమర్శిస్తున్నారని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మండిపడ్డారు. కళ్లు పెద్దవి చేసుకుని చూస్తే నాడు - నేడు ఏం జరిగిందో అర్థం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్ ప్రణాళికాబద్ధంగా రైతులకు మేలు జరిగే చర్యలు తీసుకుంటున్నారని మంత్రి తెలిపారు.
విద్యుత్ ఉద్యోగుల పీఆర్సీపై విద్యుత్ జేఏసీ - యాజమాన్యాల మధ్య ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. విద్యుత్ ఉద్యోగుల రివైజ్డ్ పే స్కేళ్లను యాజమాన్యం ఖరారు చేసింది. సింగిల్ మాస్టర్ స్కేల్తో కూడిన పీఆర్సీ ఒప్పందంపై విద్యుత్ ఉద్యోగుల జేఏసీ సంతకాలు చేసింది. కొత్త పీఆర్సీ ప్రకారం 8 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
2024లో గాజువాకలో జనసేన జెండా ఎగరడం ఖాయమని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. ఓడిపోయిన ఒక నాయకుడికి గాజువాకలో ఇంత ఆదరణ లభించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. గాజువాకను తాను ఎప్పుడు వదల్లేదని.. తాను ఓడిపోవడం తప్ప తప్పు చేయలేదని పవన్ అన్నారు. జనసేన ఆశయానికి ప్రజలు అండగా ఉంటారనేది ఎప్పటికప్పుడు మీ ఆదరణ నిరూపిస్తోందని ఆయన పేర్కొన్నారు.
నడకమార్గంలో చిరుతల దాడుల నేపథ్యంలో టీడీడీక కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల భధ్రత దృష్టా రేపటి నుంచి ఉదయం 5 గంటల నుంచి మధ్యహ్నం 2 గంటల వరకే చిన్నారులను నడకమార్గంలో అనుమతించనుంది టీటీడీ.