Vizag Boy Hemanth Commits Suicide Due To Loan Apps Harassment: అధికారులు ఎంత హెచ్చరిస్తున్నా.. లోన్ యాప్ వేధింపులు మాత్రం తగ్గడం లేదు. తమ వద్ద నుంచి తీసుకున్న రుణాలు తిరిగి ఇవ్వడం లేదని.. వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకొని, మార్ఫింగ్ ఫోటోలతో బెదిరింపులకు పాల్పడుతూనే ఉన్నారు. దీంతో.. బాధితులు అవమానంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా వైజాగ్‌కి చెందిన మరో యువకుడు ఈ వేధింపులు తాళలేక సూసైడ్ చేసుకున్నాడు.
Isha Foundation: 10 వేల మంది సైనికులకు క్లాసికల్ హఠ యోగా శిక్షణ: ఈశా ఫౌండేషన్
ఆ వివరాల్లోకి వెళ్తే.. కంచరపాలెం కప్పరాడ ప్రాంతానికి చెందిన గున్న హేమంత్(30) అనే యువకుడు ఒక ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొంతకాలం క్రితం లోన్ యాప్స్ నుంచి కొంత రుణం తీసుకున్నాడు. అయితే.. సమయానికి డబ్బులు కట్టలేక పోయాడు. కొంతమొత్తమే తిరిగి చెల్లించగలిగాడు. డబ్బులు వచ్చాక మిగిలిన మొత్తాన్ని చెల్లించాలని అనుకున్నాడు. కానీ.. ఇంతలోనే లోన్ యాప్ నిర్వాహకులు అతడ్ని వేధించడం మొదలుపెట్టారు. వెంటనే బాకీ చెల్లించాలని, లేదంటే తమ వద్దనున్న మార్ఫింగ్ ఫోటోలను నెట్‌లో పెడతామని, అలాగే కుటుంబ సభ్యులకు కూడా తెలియజేస్తామని బెదిరించారు. తనకు కొంత సమయం ఇవ్వాలని ప్రాధేయపడినా.. వాళ్లు వినిపించుకోలేదు. ఇంకా ఎక్కువగా వేధించడం స్టార్ట్ చేశారు.
Adani Group: మరింత పెరగనున్న అదానీ ‘పవర్’.. 2బిలియన్ల పెట్టుబడి పెట్టనున్న అబుదాబి కంపెనీ
దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన హేమంత్.. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. బుధవారం ఇంట్లో చెప్పి, బిర్లాకూడలి ప్రాంతంలో ఉన్న తన స్నేహితుని ఇంటికి వెళ్లాడు. అక్కడ స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. రాత్రి స్నేహితులు ఎవ్వరూ లేని సమయంలో ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్నేహితుల ద్వారా తన తనయుడు మృతి చెందాడన్న విషయం తెలుసుకున్న తండ్రి గున్న శ్రీనివాసరావు.. తన కొడుకు మృతిపై కంచరపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.