తిరుమల మాడవీధులలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టీటీడీ ఈవో ధర్మారెడ్డి పరిశీలించారు. వార్షిక బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు ఆయన వెల్లడించారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ న్యాయస్థానం నేడు విచారణ చేపట్టనుంది. అంగల్లు ఘటనలో ఏ1 గా ఉన్న చంద్రబాబు ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ నేడు విచారణకు లిస్ట్ అయింది.
టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌తో పాటు మరో రెండు పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణను వాయిదా వేసింది. క్వాష్ పిటిషన్‌పై విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ నెల 18లోపు కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని న్యాయస్థానం ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల తేదీలను సర్కారు నిర్ణయించినట్లు సమాచారం. ఈ నెల 21 నుంచి 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నట్లు తెలుస్తోంది. అవసరాన్ని బట్టి మరో 2 రోజులు పెంచే అవకాశం ఉంది.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి మేయర్ పొట్లూరి స్రవంతి షాక్ ఇచ్చారు. వైసీపీ నుంచి శ్రీధర్ రెడ్డి దూరమైన తర్వాత మేయర్ స్రవంతి ఆయన వైపే నిలిచారు. ఇటీవల కాలంలో శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డితో మేయర్ స్రవంతికి విభేదాలు తలెత్తాయి.
టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక పొలిటీషియన్ అరెస్ట్ కావడం, జైలుకు వెళ్లడం బాధాకరమే. అయితే ఆ పొలిటీషియన్ ఎలాంటి వ్యక్తి, రాజకీయ జీవితం ఏంటనేది కూడా చూడాలని ఆయన పేర్కొన్నారు.
ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా, నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వ్యవస్థకు ఆధునిక సాంకేతికతను జోడించి విప్లవాత్మక మార్పులకు జగనన్న ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఆధునిక సాంకేతికతతో కార్డ్ ప్రైం సాఫ్ట్ వేర్, ఈ-స్టాంపింగ్, గ్రామ/వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలతో ప్రజలకు మరింత సులభతరమైన రిజిస్ట్రేషన్ వ్యవస్థ అందుబాటులోకి రానుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా సంస్కరణలు భేషుగ్గా ఉన్నాయని నోబెల్ అవార్డు గ్రహీత ఫ్రొఫెసర్ మైకేల్ క్రేమెర్ ప్రశంసలు గుప్పించారు. గురువారం సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయానికి మైకేల్ క్రేమెర్‌తో పాటు పాటు చికాగోలోని డీఐఎల్ విశ్వవిద్యాలయానికి చెందిన ఎమిలీ క్యుపిటో బృందం సందర్శించారు.