విజయవాడలో బీజేపీ పదాధికారుల సమావేశం జరిగింది. కమిటీల బలోపేతంపై చర్చించారు. కమిటీల్లో మార్పు చేర్పులు, సంస్థాగత అంశాలపై సమీక్షించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మీడియా సమావేశంలో ప్రసంగించారు. తనపై గురుతర బాధ్యతలు ఉన్నాయన్న పురంధేశ్వరి.. పార్టీని బలోపేతం చేయడం తన ఒక్కరి వల్లే సాధ్యం కాదన్నారు. ప్రతి కార్యకర్త సహకారం అందించినప్పుడే పార్టీ బలోపేతం సాధ్యం అవుతుందన్నారు.
గుంటూరు ఏటి అగ్రహారం లో మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పర్యటిస్తున్నారు. ఆటో డ్రైవర్ యూనియన్ తో అంబటి రాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా Ntv తో అంబటి రాయుడు మాట్లాడుతూ.. విద్య వ్యవస్థ, వ్యవసాయ, కార్మిక సమస్యల పై ప్రజలని కలుస్తున్నానని తెలిపారు. ప్రభుత్వంపై కార్మికులు, రైతుల్లో మంచి స్పందన వస్తుందని ఆయన వెల్లడించారు. నేను చూసినంతవరకు ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని ఆయన వెల్లడించారు. మంచిపనులు జరగాలంటే కొంత ఓపిక కావాలని ఆయన అన్నారు. breaking…
ప్రకాశం జిల్లా దర్శి సమీపంలో ఆర్టీసీ బస్సు ప్రమాద సంఘటన స్థలాన్ని కలెక్టర్ ఏయస్ దినేశ్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఘటనకు సంబంధించి...