అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణంలో చోటుచేసుకుంది. కులం పేరుతో దూషించినందుకు స్నేహితుడిని తోటి స్నేహితులు హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తిరుపతి జిల్లా పుంగనూరులో కిడ్నాప్ తర్వాత దారుణ హత్యకు గురైన చిన్నారి అస్పియ కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి పరామర్శించారు. అనంతరం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. చిన్నారి మృతి బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత జరిగినా కూడా పోలీసులు దోషులపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.
విద్యుత్ రంగంలో ఆంధ్రప్రదేశ్ ను దేశంలోనే నెంబర్ వన్ స్టేట్ గా నిలిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. బుధవారం సచివాలయంలో విద్యుత్ రంగానికి సంబంధించిన ప్రైవేటే విద్యుత్ ఉత్పత్తి సంస్థల అధిపతులతో మంత్రి గొట్టిపాటి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి దేశంలోని ప్రతిష్ఠాత్మక అన్నీ పునరుత్పాదక విద్యుత్ సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సమావేశంలో ఏపీ…
ప్రజలను పదేపదే కార్యాలయాలకు తిప్పుకోవద్దని మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులకు సూచించారు.తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజల సమర్పించిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు జీరో స్థాయికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్లకు రాష్ర్ట రెవిన్యూ, రిజిస్ర్టేషన్ అండ్ స్టాంప్స్ శాఖా మంత్రి ఆదేశించారు.
ప్రభుత్వ మద్యం షాపుల విధానానికి స్వస్తి పలుకుతూ రాష్ట్రంలో నూతన మద్యం పాలసీకి నోటిఫికేషన్ జారీ చేసామని ఎక్సైజ్, ప్రొహిబిషన్ శాఖ సంచాలకులు నిషాంత్ కుమార్ తెలిపారు.
రేపు స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు మచిలీపట్నం వస్తున్నట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నేషనల్ లా కాలేజీ, డంపింగ్ యార్డ్, టీటీడీ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొంటారన్నారు.
ఆంధ్రప్రదేశ్ లో అర్ధాంతరంగా ఆగిపోయిన కానిస్టేబుల్ నియామక ప్రక్రియను సత్వరమే చేపట్టేందుకు కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రేషన్ కార్డు దారులకు సబ్సిడీపై కందిపప్పు, పంచదార పంపిణీ చేసే కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలో మంగళవారం మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా ప్రారంభించారు.