Minister Atchannaidu: గుంటూరు కలెక్టరేట్‌లో కౌలు రైతుల చట్టంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. కౌలు రైతుల చట్టంపై ఐదు జిల్లాల వ్యవసాయ అధికారులతో సమీక్షించారు. 1956 లోనే కౌలు రైతుల చట్టం తీసుకుని వచ్చారని.. 2011లో కౌలు రైతుల చట్టం లో అనేక మార్పులు చేశారని, దీన్ని వల్ల సమస్యలు వచ్చాయని మంత్రి వెల్లడించారు. గత ఐదేళ్ల కాలంలో కౌలు రైతులు ఇబ్బందులు పడ్డారని, కౌలు కార్డులు ఎవరికి ఇవ్వలేదని విమర్శించారు.
Read Also: Duvvada Srinivas-Madhuri: తిరుమలలో దువ్వాడ – మాధురి ప్రీ వెడ్డింగ్ షూట్
మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి చట్టం చేయడం కాకుండా రైతులు, కౌలు దారులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు సూచించారన్నారు. 7 ప్రాంతీయ సదస్సులు పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని చట్టం రూపకల్పన చేస్తామన్నారు. తొలి ప్రాంతీయ సదస్సు గుంటూరులో పెట్టామని మంత్రి వెల్లడించారు. అందరికీ ఆమోదయోగ్యమైన, ప్రయోజనకరమైన కౌలు చట్టం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అచ్చె్న్నాయుడు స్పష్టం చేశారు.