CM Chandrababu: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు కేంద్ర మంత్రి అమిత్ షా అధ్యక్షతన మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో జరిగే సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. చత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల సీఎంల సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. 2026 నాటికి వామపక్ష తీవ్రవాదం ఆనవాళ్లు ఉంకూడదనే టార్గెట్‌గా కేంద్రం పని చేస్తోంది.
Read Also: Tirumala: మూడో రోజు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు.. సింహవాహనంపై మలయప్పస్వామి
మావోయిస్టుల ఏరివేత, మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలపై కేంద్రం చర్చించనుంది. రోడ్ కనెక్టివిటీ, ఫోన్ కనెక్టివిటీ పెంచేలా కేంద్రం చర్యలు తీసుకోనుంది. ఏపీలో మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి, కావాల్సిన నిధులపై కేంద్రానికి ముఖ్యమంత్రి నివేదిక ఇవ్వనున్నారు. కేంద్ర మంత్రితో సమావేశం అనంతరం అందుబాటులో ఉన్న ఢిల్లీ పెద్దలను సీఎం చంద్రబాబు కలిసే అవకాశం ఉంది.