AP Crime: కులం పేరుతో దూషించినందుకు స్నేహితుడి హత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Crime: అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణంలో చోటుచేసుకుంది. కులం పేరుతో దూషించినందుకు స్నేహితుడిని తోటి స్నేహితులు హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 27న లోతు గడ్డ జంక్షన్ టేకుల తోట వద్ద దొరికిన మృతదేహాన్ని గుర్తించి పోలీసులు విచారణ చేపట్టడంలో అసలు విషయం తెలిసింది. మృతుడు రాజమండ్రికి చెందిన దొడ్డి రాజా అర్జున్ (50)గా గుర్తించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నట్లు తెలిసింది.
Read Also: Terrible Incident: తాగొచ్చి గొడవ చేసిన తండ్రి.. కిరాతకంగా హతమార్చిన కొడుకు..
Also Read
- LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
- Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
- IND Vs WI: సెంచరీతో చెలరేగిన గ్రీవ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం..
- Parvesh Verma Slap Row: ఆప్ ఎమ్మెల్యేతో వాగ్వాదం.. యువకుడిని కొట్టిన ఢిల్లీ మంత్రి..
రాజమండ్రికి చెందిన ఇద్దరు నిందితులు వెంకటేష్, పుష్ప రాజ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. రాజమండ్రి నుంచి ముగ్గురు స్నేహితులు లోతు గడ్డ జంక్షన్‌కు వచ్చారని పోలీసుల విచారణలో తేలింది. లోతు గడ్డ జంక్షన్ వద్ద మద్యం సేవించి ముగ్గురిలో ఒకరైన పుష్పరాజును అర్జున్ కులం పేరుతో దూషించినట్లు తెలిసింది. ఈ క్రమంలో ముగ్గురి మధ్య వాగ్వాదం పెరిగింది. ఈ నేపథ్యంలో వెంకటేష్, పుష్ప రాజ్‌లు ఇద్దరు కలిసి అర్జున్‌ను చింతలూరు సమీపంలో ఉన్న తోటలోకి తీసుకెళ్లారు. అనంతరం ఇద్దరు కలిసి అర్జున్‌ను రాయితో మోది హత్య చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు.
తాజావార్తలు
-
Trivikram Srinivas: ‘ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం’ వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
-
LNG Train: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. దేశంలో తొలి LNG రైలుకు గ్రీన్ సిగ్నల్..
-
Bank Strike: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల బ్యాంక్ సమ్మె.. కారణం ఇదే
-
Karthi: “డీఎంకే అయినా.. టీవీకే అయినా ఇంతేనా?” విజయ్ సర్కార్‌ను నిలదీసిన హీరో కార్తి!
-
KPHB: హైదరాబాద్‌లో చీటీల పేరిట రూ.16 కోట్ల కుచ్చుటోపీ
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?