తిరుపతి లడ్డూను వివాదంలోకి తీసుకురావాలనేది వైయస్సార్ వైసీపీ ఉద్దేశం కాదని.. చంద్రబాబు వివాదమాయం చేయాలని ప్రయత్నించినప్పుడు... ఆయన చెప్పిన అబద్ధాలపై వివరాలను మాత్రమే ఇచ్చామని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.
తిరుపతి లడ్డు వివాదాన్ని అర్థం చేసుకున్నందుకు సుప్రీంకోర్టుకు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ ధన్యవాదాలు తెలిపారు. ఏపీ హైకోర్టులో సీబీఐతో విచారణ జరపాలని కేసు వేశానన్నారు. తిరుపతిని కేంద్ర పాలిత ప్రాంతంగా ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు.
సినీనటి జెత్వానీ కేసులో కొత్త కొత్త ట్విస్ట్‌లు ఉంటాయా? ఇంకొందరు ఐపీఎస్ ఆఫీసర్స్ మెడకు చుట్టుకోబోతోందా? ఈ ఎపిసోడ్లో మాజీ డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్‌రెడ్డి పేరు ఎందుకు వస్తోంది? ఇప్పటికే సస్పెండ్ అయిన ముగ్గురు ఐపీఎస్‌లు మరికొన్ని కేసుల్లో కూడా ఇరుక్కోబోతున్నారన్నది నిజమేనా? అసలు జెత్వానీ కేసు కేంద్రంగా జరగబోతున్న కొత్త పరిణామాలు ఏంటి? సినీనటి కాదంబరి జెత్వానీ కేసులో ఏపీకి చెందిన ముగ్గురు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్స్ సస్పెండ్ అయ్యారు. అది కూడా ఆమెను కేసులతో…
రాబోయే పండుగలకు చేనేత వస్త్రాలు కొనుగోలు చేద్దాం అంటూ ఏపీ సీఎం నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. పండుగ వేళ చేనేత దుస్తులు ధరించుదాం... నూలుపోగుతో అద్భుతాలు సృష్టించే చేనేత కార్మికులు కూడా మరింత ఆనందంగా పండుగ చేసుకునేలా చేద్దాం అని సూచించారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్ యూసుఫ్ అలీ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో మధ్యాహ్నం దాదాపు రెండు గంటల పాటు ముఖ్యమంత్రితో లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ సమావేశం అయ్యారు. ఆయనతో పాటు వచ్చిన బృందంతో రాష్ట్రంలో పెట్టుబడులపై చంద్రబాబు చర్చించారు.
గత వారం రోజులుగా తిరుపతి లడ్డూపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోందని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ పేర్కొన్నారు. తిరుపతి లడ్డూపై చంద్రబాబు కుటిల రాజకీయాలను జగన్మోహన్ రెడ్డి బట్టబయలు చేశారన్నారు. వెంకటేశ్వరస్వామిపై చంద్రబాబు చాలా పెద్ద నింద వేశారన్నారు. ఆ నిందారోపణలు పోగొట్టడానికి రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు పూజలు చేశారన్నారు.
డిక్లరేషన్ వివాదంపై పోసాని కృష్ణమురళి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ తిరుపతి కొండకు వెళ్లడానికి డిక్లరేషన్ ఇవ్వాలని సీఎం చంద్రబాబు అంటున్నారని.. కొండపైకి వెళ్లడానికి జగన్ అఫిడవిట్ ఎందుకు ఇవ్వాలని ఆయన ప్రశ్నించారు. ఏ ఉద్దేశంతో జగన్‌ను టార్గెట్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
మాజీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. జనాలను మోసం చేసినట్టు స్వామి వారిని మోసం చేయాలనుకోవడం చంద్రబాబు భ్రమే అంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డి దమ్ము, ధైర్యం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. భయపడలేదు కాబట్టే నిన్న ప్రెస్‌మీట్ పెట్టి నా మతం మానవత్వం అని చెప్పారన్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రులు అనిత, డోల బాలవీరాంజనేయ స్వామి, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, పొలిట్ బ్యూరో సభ్యుల వర్ల రామయ్యలు భేటీ అయ్యారు. అనంతపురం జిల్లాలో రాముల వారి రథానికి నిప్పు పెట్టిన ఘటనపై పోలీసుల అధికారులు తీరుపై సీఎం వద్ద పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు.