ఉదయం నుంచి నిరాటంకంగా జరిగి లాటరీ విధానాన్ని మధ్యాహ్నం 3 గంటలకు పూర్తి అయింది. కాగా లాటరీ కొందరి పంట పండింది. వేసిన లాటరీల్లో చాలా మందికి షాపులు రాగా.. వారు ప్రస్తుతం నగదు సమీకరణ పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా.. మద్యం దుకాణాల లాటరీలో బీజేపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు పంట పండింది. ఆయన ఏకంగా ఐదు దుకాణాలను దక్కించుకున్నారు.
సచివాలయంలో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఎంఎస్ఎంఈ, ఫుడ్ ప్రాసెసింగ్ డ్రాఫ్ట్ పాలసీలపై అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. నూతన పాలసీతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తెచ్చేందుకు సీఎం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సమగ్ర మార్పులతో 7-8 శాఖల్లో నూతన పాలసీలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. మూడు నెలలుగా కొత్త పాలసీలపై అధికారులు సమగ్ర కసరత్తు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు మొత్తం 89,882 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు ఫీజు ద్వారా ప్రభుత్వానికి రూ. 1797.64 కోట్ల ఆదాయం లభించింది. అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువగా దరఖాస్తులు రాగా.. వీటిని పునః పరిశీలించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది.
కాకినాడ సినిమా రోడ్డులో చోరీ ఘటన చోటుచేసుకుంది. చందాకి వచ్చి మత్తు మందు చల్లి 50 గ్రాములు బంగారం చోరీకి పాల్పడ్డారు కేటుగాడు.. మంజు శ్రీ అనే మహిళ భర్త బయటకు వెళ్లగా, పిల్లలు సెలవులకు ఊరు వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉంది.
గుంటూరు కలెక్టరేట్లో కౌలు రైతుల చట్టంపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. కౌలు రైతుల చట్టంపై ఐదు జిల్లాల వ్యవసాయ అధికారులతో సమీక్షించారు.
కొత్త ఇసుక విధానంలో లోపాలున్నాయని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇసుక కొరత, ధరలను రాజకీయ కోణంలో కాకుండా ప్రజల ఇబ్బందులన దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నామన్నారు. ఉచిత ఇసుక అన్నప్పుడు సీవరేజ్ టాక్స్ అవసరం ఉండదన్నారు.
రాష్ట్రంలో మెరుగైన రోడ్ల నిర్మాణమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక వసతుల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధ్వంసమైన 7071 కి.మీ రహదారులకు సంబంధించిన 1393 రోడ్లను గుంతల రహిత రహదారులుగా మార్చేందుకు రూ.290 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశామని మంత్రి వివరించారు
చదివింది తొమ్మిదో తరగతి.. కానీ మోసాలు చేయడంలో మాత్రం ఇస్రో శాస్త్రవేత్తల కంటే ఎక్కువ తెలివితేటలు చూపించి నాలుగు పెళ్లిళ్లు చేసుకుని మోసాలకు పాల్పడుతున్నాడొక నిత్య పెళ్ళికొడుకు. ఇస్రోలో హెచ్ఆర్ ఉద్యోగం అని చెబుతూ.. వందల ఎకరాల పొలాలు, విల్లాలు ఉన్నాయని ... పెళ్లికూతుళ్ల కుటుంబ సభ్యులకు ఇస్రోలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ బంపర్ ఆఫర్లు ఇచ్చి లక్షలకు లక్షలు దోచేస్తున్న ఆ ప్రబుద్ధుడి ఆట కట్టించారు ఏలూరు జిల్లా భీమడోలు పోలీసులు
సాంకేతిక కారణాలతో పరిహారం అందని వరద నష్ట బాధితులకు రేపు ఏపీ ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది. 98 శాతం లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటికే రూ.18 కోట్లు ప్రభుత్వం జమ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల విజయవాడ వరదల్లో తీవ్రంగా నష్టపోయిన వరద బాధితుల్లో 21,768 మంది బాధితులు తమ బ్యాంకు ఖాతాలను తప్పుగా నమోదు చేసినట్లు అధికారులు గుర్తించారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు కేంద్ర మంత్రి అమిత్ షా అధ్యక్షతన మావోయిస్ట్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో జరిగే సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. చత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల సీఎంల సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది.