ఏపీలో పీసీసీ చీఫ్ మార్పుపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత కిల్లి కృపారాణి కీలక వ్యాఖ్యలు చేశారు. పీసీసీ చీఫ్ మార్పుపై అపోహలు వద్దన్నారు. షర్మిల గురించి అధిష్టానానికి ఎటువంటి ఫిర్యాదు చేయలేదున్నారు. అయినా షర్మిల వర్కింగ్ స్టైల్ ఆమెదని చెప్పుకొచ్చారు.
లిక్కర్ స్కామ్‌పై చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. కల్తీ మద్యం ద్వారా సంపాదించిన సొమ్ముతో బంగారం కొనుగోలు చేయడం, రియల్ ఎస్టేట్, సినిమాలు తీయడం, జింబాబ్వే, టాంజానియా, జాంబియా వంటి దేశాల్లో మైనింగ్‌పై పెట్టుబడులు పెట్టారన్నారు.
భార్యాభర్తల మధ్య సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. కొంత మంది వివాహేతర సంబంధాల కోసం హత్యలకు తెగబడుతుంటే.. ఇంకొందరు కుటుంబ కలహాలతో జీవిత భాగస్వాములను అంతమొందిస్తున్నారు.
ఇవాళ శ్రీవారి పవిత్రోత్సవాలకు అంకురార్పణ.. రేపటి నుంచి మూడు రోజుల పాటు శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు.. మూడు రోజులు పాటు ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ ఇవాళ ఉదయం 11.30 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు.. కొన్ని కీలక శాఖలకు సంబంధించి సమీక్ష.. జీఎస్డీపీపై సమీక్ష నిర్వహించే అవకాశం ఇవాళ బెంగుళూరు నుంచి తాడేపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్.. ఉదయం 9.10 గంటలకు బెంగుళూరులోని తన నివాసం నుంచి ఎయిర్ పోర్టుకు బయలుదేరి 9.30…
కలుషిత ఆహార నగరంగా విశాఖ.. తనిఖీల్లో విస్తుపోయే నిజాలు.. విశాఖ కలుషిత ఆహార నగరంగా మారింది.. చిన్నపిల్లలు తినే తిండి దగ్గర నుంచి, మహిళలు, గర్భిణీలు తినే ఆహారాన్ని కల్తీ చేసి అమ్ముతున్నట్లు గుర్తించారు. వారం రోజుల నిల్వ ఉంచిన ఫుడ్, కాలం చెల్లిన ఆహార పదార్థాలు, కుళ్ళిపోయిన మాంసపు పదార్థాలతో వంటకాలు ప్రిపేర్ చేస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ అధికారుల జాయింట్ ఆపరేషన్‌లో భాగంగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. రోజుల తరబడి నిల్వ ఉంచిన…
Bheemili Domestic Violence: విశాఖపట్నం జిల్లా భీమిలి మండలంలోని నేరెళ్లవలసలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో అర్ధరాత్రి నిద్రిస్తున్న భర్తపై భార్య వేడివేడి నీళ్లు పోసింది. ఈ ఘటనలో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. సలసల కాగే నీటికి అతడి ముఖం, ఛాతి భాగం కాలిపోయింది. స్థానికులు వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై అందరూ షాక్‌కు గురవుతున్నారు. వివరాల్లోకి వెళితే.. Also Read: Vangalapudi Anitha: వైఎస్ జగన్ మానసిక పరిస్థితిపై…
ఏపీలో కూటమి ప్రభుత్వానికి పవన్‌కళ్యాణ్ ఝలక్‌లు ఇస్తున్నారా? కేబినెట్ మీటింగ్‌లోనే నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు చెప్పేస్తున్నారా? అందుకే కొన్ని కీలకమైన నిర్ణయాల విషయంలో ప్రభుత్వ దూకుడుకు సడన్ బ్రేకులు పడుతున్నాయా? అసలు కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? కేబినెట్లో పవన్ ఎందుకు అడ్డుపడుతున్నారు? ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తోంది. ఇన్నాళ్ళు అలా… అలా… గడిచిపోయింది. కూటమి పార్టీల మధ్య సమన్వయం విషయంలో పెద్దగా ఇబ్బందులేమీ రాలేదు. కానీ…ఇప్పుడు మాత్రం ఆ పరంగా… ఎక్కడో,…
ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయానికి సీఎం చంద్రబాబు.. పలు కీలక శాఖలకు సంబంధించి సమీక్ష బాపట్ల జిల్లా పర్చూరు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం కొమ్మాలపాడు, మక్కెనవారిపాలెం పాఠశాలల్లో బాలికలకు ఉచిత సైకిళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు ఉదయం 10 గంటలకు పోలీసుల విచారణకు హాజరుకానున్న కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్…
ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ కేబినెట్ సమావేశం.. బీపీఎస్, ఎల్ఆర్ఎస్ స్కీమ్‌లకు ఆమోదం తెల్పనున్న కేబినెట్ ఇవాళ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో ఏపీ సీఈఓ సమావేశం.. ఏపీ సచివాలయంలో ఉదయం 11 గంటలకు భేటీ.. ఓటర్ల జాబితా సమగ్ర సవరణపై చర్చించే అవకాశం శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పరిధిలోని ముద్దిరెడ్డిపల్లిలో శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి.. అమ్మవారికి బోనాలు సమర్పించనున్న భక్తులు నేటికి రాజమండ్రి సెంట్రల్ జైల్లో 4వ రోజుకు చేరుకున్న వైసీపీ…
మాజీ మంత్రి పేర్ని నాని క్వాష్ పిటిషన్‌పై నేడు ఏపీ హైకోర్టు విచారణ.. రప్పా రప్పా వ్యాఖ్యలపై నమోదైన కేసు క్వాష్ చేయాలని పేర్ని పిటిషన్ ఎంపీ మిథున్ రెడ్డి పిటిషన్ల మీద నేడు ఏసీబీ కోర్టు విచారణ.. జైల్లో కొన్ని వసతులు కల్పించాలని, ఇంటి భోజనానికి అనుమతి ఇవ్వాలని, వారంలో ఆరు ములాఖాత్‌లు ఇవ్వాలని, టీవీ ఏర్పాటు చేయాలని పిటిషన్.. నేడు విచారణ జరపనున్న న్యాయస్థానం నేటితో ముగియనున్న లిక్కర్ స్కాం కేసులో నిందితుల రిమాండ్..…