బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికీ నష్టం లేదు: బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎవరికీ నష్టం లేదని ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. వందేళ్ల నుంచి గోదావరిలో ఏటా సగటున 2 వేల టీఎంసీల నీరు సముద్రంలోకి పోతోందన్నారు. వృథా అవుతున్న నీటిని వినియోగించుకునేందుకే బనకచర్ల ప్రాజెక్టు అని తెలిపారు. ఎగువ ఉన్న తెలంగాణ వాళ్లు ప్రాజెక్టులు కట్టుకుంటే తాను ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని, ఇకపై కూడా చెప్పను అని చెప్పారు. సముద్రంలోకి పోయే నీళ్లను వాడుకుంటే…
గోవిందరాజస్వామి ఆలయం వద్ద భారీ అగ్ని ప్రమాదం: తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున ఆలయం ముందు భాగంలో ఉన్న ఓ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు ఆలయం ముందురున్న చలువ పందిళ్లు అంటుకున్నాయి. మంటలను చూసి భయంతో ఆలయ సమీపంలోని లాడ్జ్ నుండి భక్తులు బయటి వచ్చి పరుగులు తీశారు. స్థానికులు భారీ మంటలను చూసి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి…
అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా విమానాల్లో వరుసగా సాంకేతిక లోపాలు కలవర పెడుతున్నాయి. తాజాగా జపాన్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. అసోసియేటెడ్ ప్రెస్ (AP) ప్రకారం.. జపాన్ ఎయిర్‌లైన్స్ విమానం దాదాపు 36,000 అడుగుల ఎత్తు నుంచి అకస్మాత్తుగా కిందికి వెళ్లింది. దీంతో సిబ్బంది వెంటనే ప్రయాణికులకు ఆక్సిజన్ మాస్క్‌లు అందించారు. ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట: సుప్రీంకోర్టులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఊరట లభించింది. మైనింగ్ కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని న్యాయస్థానాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది. దీంతో జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ కే వినోద్ చంద్రన్ల ధర్మాసనం విచారణ జరిపింది. బుధవారం విచారించిన ధర్మాసనం.. మైనింగ్ వాల్యూయేషన్‌పై నివేదిక ఇచ్చిన తర్వాత చూస్తామని తెలిపింది. సీల్డ్ కవర్లో కోర్టుకు నివేదిక ఇవ్వాలని ధర్మాసనం కోరింది. తమ…
సుప్రీంకోర్టులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఊరట లభించింది. మైనింగ్ కేసులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ రద్దు చేయాలని న్యాయస్థానాన్ని ఏపీ ప్రభుత్వం కోరింది.
తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి విమానం చక్కర్లు కొట్టింది. ఆగమశాస్ర్త నిబంధనలకు విరుద్దంగా ఆలయంపై విమానాలు వెళ్లడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని నో ఫ్లైయింగ్ జోన్ ప్రకటించాలని అనేక మార్లు కేంద్రాన్ని కోరారు. కానీ కార్యరూపం దాల్చలేదు.
ఏపీలో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ప్రారంభిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వృద్ధాప్య పెన్షన్, తల్లికి వందనం, దీపం పథకం ద్వారా ఏటా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తోంది. ఈ విషయాలను ప్రభుత్వ ప్రజలకు వివరించనుంది.
2 రోజులు కుప్పంలో చంద్రబాబు పర్యటన: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేటి నుంచి రెండు రోజుల పాటు సొంత నియోజకవర్గం కుప్పంలో పర్యటించనున్నారు. బుధ, గురువారాల్లో కుప్పంలో పర్యటన కొనసాగనుంది. బుధవారం మధ్యాహ్నం 12:30 గంటలకు శాంతిపురం మండలంలోని తుమిసిలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చంద్రబాబు చేరుకుంటారు. మధ్యాహ్నం 12:50 గంటలకు శాంతిపురం మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ దగ్గరకు రోడ్డు మార్గాన చేరుకుంటారు. మధ్యాహ్నం 1:30 గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. నేడు జైలు…
నేడు, రేపు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన.. మధ్యాహ్నం 12:30 గంటలకు శాంతిపురం మండలంలోని తుమిసి ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకోనున్న సీఎం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ పార్టీ సమావేశం.. అందుబాటులో ఉన్న నేతలతో వైఎస్ జగన్ సమావేశం నేడు జైలు నుంచి విడుదల కానున్న వల్లభనేని వంశీ.. 138 రోజులుగా జైల్లో ఉన్న వంశీ.. 11 కేసుల్లో వంశీకి బెయిల్.. చివరి కేసులో నిన్న బెయిల్ ఇచ్చిన నూజివీడు కోర్టు లిక్కర్ స్కాం…